Thadalan Koil, Sirkazhi
తాదళన్ కోవెల గతంలో మనం శిర్కాలి చుట్టుపక్కల ఉన్న పదకొండు తిరునాన్గూర్ శ్రీ వైష్ణవ దివ్యదేశాల గురించి తెలుసుకున్నాము. శిర్కాలి లోనే మరికొన్ని దివ్యదేశాలు ఉన్నాయి. కానీ అవి తిరునాన్గూర్ శ్రీ వైష్ణవ దివ్యదేశాల క్రిందికి రావు. కానీ వాటిల్లో కూడా పాశుర గానం చేసింది తిరుమంగై ఆళ్వార్ మాత్రమే ! దివ్యదేశాలలో అధికశాతం శ్రీ మహా విష్ణువు ఉపస్థిత, స్థానక మరియు శయన భంగిమలలో కొలువై దర్శనమిస్తారు. శ్రీ రామునిగా, శ్రీ కృష్ణునిగా, శ్రీ నారసింహునిగా దర్శనమిచ్చే క్షేత్రాలు కొద్ది. ఇక మిగిలిన దశావతారాల రూపాలలో కనపడేది ఇంకా స్వల్పం. చిత్రంగా మూడు దివ్యదేశాలలో స్వామి త్రివిక్రమునిగా కొలువై ఉంటారు. అవి శ్రీ ఉలగండ పెరుమాళ్ కోవెల, కాంచీపురం, శ్రీ ఉలగనాథ పెరుమాళ్ కోవెల, తిరుక్కోవిలూర్. మూడవది శిర్కాలి లోని శ్రీ కలి శీరం విన్నగరం. ఈ క్షేత్ర గాధ కూడా మిగిలిన రెండు దివ్య దేశాల పౌరాణిక గాధ కూడా ! పౌరాణిక గాధ ప్రహ్లాదుని మనుమడైన బలి చక్రవర్తి మహావీరుడు....