Sri Tyagaraja Swamy Temple. Tiruvarur

శ్రీ త్యాగరాజ స్వామి ఆలయం, తిరువారూర్ దైవభూమి, కర్మభూమి, యోగ భూమి మరియు మోక్ష భూమిగా యుగయుగాలుగా ప్రసిద్ధి చెందినది భరత భూమి. అందువలననే అనేక పవిత్ర తీర్థ క్షేత్రాలు దేశం నలుమూలలా కనిపిస్తాయి. వీటిల్లో కొన్ని మహామహితాత్మకమైనవి. తిరువారూర్ అలాంటి వాటిల్లో ఒకటిగా చెప్పుకోవచ్చును. తిరువారూర్ ఎందుకని మహాక్షేత్రంగా ప్రసిద్దికెక్కినది అనేదానికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. తిరువారూర్ లో జన్మించిన వారికి ముక్తి లభిస్తుంది అన్నది పురాణ వాక్యం. శ్రీ త్యాగరాజ స్వామి తిరువారూర్ మూలవిరాట్టు "శ్రీ వాల్మీకినాథర్". అయినా ప్రాధాన్యత శ్రీ త్యాగరాజ స్వామి కి ఇవ్వబడుతుంది. కారణం ఏమిటంటే ఈ సోమస్కంద మూర్తి శ్రీ మహావిష్ణు సృష్టి. ఆయన వక్షస్థలం మీద కొలువుతీరి ఉండేది. సోమస్కంద మూర్తి అనగా శివపార్వతుల మధ్య శ్రీ సుబ్రమహ్మణ్యేశ్వరుడు ఉపస్థితులై ఉంటారు. అంతటి మహిమాన్విత మూర్తి భూలోకానికి రావడం తొలితరం చోళ రాజు ముచికుంద మహారాజు జీవ...