Tiruvetakalam
పార్దుడు పాశుపతం పొందినది ఇక్కడే వనవాస కాలంలో సమయం వృథా చేయకుండా రాబోయే యుద్ధంలో ఉపయోగపడే పాశుపతాస్ర్తము పొందమని పాండవ మధ్యమునికి సలహ ఇచ్చారు శ్రీ కృష్ణ భగవాన్. ఆ ప్రకారం అరణ్యంలో పరమేశ్వర అనుగ్రహం కొరకు తపస్సు చేయసాగాడు అర్జునుడు. ఒకనాడు అడవి పంది ఒకటి దాడి చేయడానికి రాగా ఫల్గుణుడు దాని మీదకు శరం వేశాడు. ఇంతలో మరోవైపు నుంచి మరో బాణం పందిని తాకింది. సూకరం మృతి చెందింది. " నేను వేసిన బాణం వలన నే చచ్చింది కనుక వేట నాది" అంటూ ప్రవేశించాడొక వేటగాడు. అతని పాటు భార్య ఇతర అనుచరులు ఉన్నారు. " పందిని కావాలంటే తీసుకో! కాని దాని చావుకు కారణం నేను సంధించిన శరం " అన్నాడు విజయుడు. వాదం పెరిగి చివరకు ఇరువురి మధ్య యుద్దానికి దారి తీసింది. భీకరమైన పోరు జరిగింది. అర్జనుని శరాఘాతానికి అంతర్యామి గాయపడ్డారు. అప్పుడు ఆయన తన నిజస్వరూపం ధరించారు. తెలియకుండా చేసిన తప్పు క్షమించమని ప్రార్దించాడట పార్దుడు. ఆశీర్వదించి పాశుపతం అనుగ్రహించారట. గాయపరచిన వానిని దగ్గర...