pancha kosha yatra
పుణ్య ప్రదం పంచ కోశి యాత్ర భగవదనుగ్రహం కొరకు భక్తులు ఎన్నో తీర్థ పుణ్య క్షేత్రాల యాత్రలు చేస్తుంటారు. చార్ ధామ్ యాత్ర, కాశీ యాత్ర, కైలాస మానససరోవర యాత్ర, అమరనాథ్ యాత్ర, దక్షిణ దేశ యాత్ర ఇలా చాలా ! వీటన్నింటిలో ముఖ్యమైన సంకల్పం ఆయా ప్రాంతాలలో దేవాలయాలలో వివిధ రూపాలలో కొలువైన భగవంతుని సందర్శనం. కానీ దీనికి భిన్నమైన యాత్ర ఒకటి ఉన్నది. అదే పంచ కోశ యాత్ర. దీనినే పంచ క్రోష యాత్ర అని కూడా అంటారు. అనగా నిర్ణీత వ్యవధిలో (ఒక రోజు నుండి అయిదు రోజుల లోపల) నిర్ణయించబడిన అయిదు ఆలయాలను దర్శించుకోవాలి. యాత్ర చేయాలి అనుకొన్న రోజున సూర్యోదయానికి ముందే నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకొని, స్నానాదులు చేసి బయలుదేరాలి. రోజంతా ఉపవాసం ఉండాలి(ఒక రోజు అయితే).ద్రవ పదార్ధాలను తీసుకోవచ్చును.యాత్రను కాలినడకన (చెప్పులులేకుండా) చేయాలి. పురాణ కాలం నుండి ప్రజలే కాదు పాలకులు కూడా ఈ యాత్ర (పరిక్రమ / ప్రదక్షణ) చేస్తున్నట్లుగా తెలుస్తోంది. త్రేతాయుగంలో దశరధ నందనులు నలుగురూ తమ భార్యలతో కలిసి అయోధ్యతో పాటు...