పోస్ట్‌లు

డిసెంబర్, 2018లోని పోస్ట్‌లను చూపుతోంది

Pancha Aranya Temples

                                        పుణ్యప్రదం పంచవనేశ్వర దర్శనం                                                                                            గంగాధరునికి ఉన్నన్ని గొలుసు కట్టు ఆలయాలకు లెక్క లేదు. పంచారామ క్షేత్రాలు, పంచ భూత స్థలాలు, పంచ నాట్య సభలు, పంచ బ్రహ్మ ఆలయాలు, పంచ క్రోశ ఆలయాలు, సప్త విదంగ క్షేత్రాలు, సప్త స్దాన క్షేత్రాలు, సప్త మాంగై స్థానాలు, అష్ట వీరట్ట స్థలాలు, నవ నందులు, నవ కైలాసాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు ఇలా ఎన్నో ఉన్నాయి. వీటిల్లో చాలా వరకు తమిళనాడులోనే నెలకొని ఉన్నాయి. ఇవి కాకుండా పంచ వనేశ్వర  ఆలయాలు అని కూడా ఉన్నాయి. వీటిని పంచ అరణ్య ఆలయాలు అని కూడా అంటారు.ఆలయాలున్న ప్రాంతాలు ఒకప్పుడు రకరకాల వనాలు...

Singa perumal koil

చిత్రం
                                  త్రినేత్రుడీ నరసింహుడు   లోకకంటకుడైన హిరణ్యకశ్యపుని సంహరించిన అనంతరం శ్రీ నృసింహ స్వామి 32 క్షేత్రాలలో వివిధ రూపాలలో పలు కారణాల మూలంగా కొలువుదీరి కొలిచిన వారిని కాపాడుతున్నారు అని భక్తులు విశ్వసిస్తారు. దీనికి ఆధారం జగద్గురు శ్రీ శ్రీ శ్రీ ఆది శంకరాచార్య విరచిత శ్రీ నృసింహ గాథా లహరి. ఈ ముప్పై రెండు క్షేత్రాలలో మొదటిదిగా అహోబిలం కాగా చివరిది విశాఖ జిల్లాలోని సాగరతీర పట్టణం భీమిలిలో సౌమ్య గిరి మీద ఉన్న ఆలయం. చివరి ఆలయంలో నృసింహుడు మానవరూపంలో కనపడతారు. మిగిలిన వాటిలో అధిక శాతం మనరాష్ట్రంతో పాటు తమిళనాడు లో ఉన్నాయి. వాటిల్లో ఒకటి చెంగల్పట్టు కు చేరువలో ఉన్న సింగ పెరుమాళ్ కోయిల్. గతంలో పాదాలాద్రి పురం, ఆళ్వార్ నరసింగ దేవర, నరసింగ విన్నగర్ ఆళ్వార్, పాదాలాద్రి నరసింగ పెరుమాళ్ కోయిల్ గా పిలువబడి చివరికి సింగపెరుమాళ్ కోయిల్ గా స్థిరపడింది. ఇక్కడ కొలువు తీరిన శ్రీ నృసింహ స్వామి వారి మూలంగానే ఈ ఊరికి ఇన్ని పేర్లు వచ్చాయి. ప్రళయ భీకర రూపంలో అ...

Mahadeva Mandir, Devabaloda

చిత్రం
                       మహారాజులు కొలిచిన  మహాదేవుడు   భారత దేశాన్ని సుదీర్ఘ కాలం ఎన్నో రాజ వంశాలు పాలించాయి. గుప్తులు, మౌర్యులు, చోళులు, పల్లవులు, చేర, పాండ్య,చాళుక్య, విజయనగర,రెడ్డి, కాకతీయ,శాతవాహనులు,నాయక,మరాఠా, గజపతులు  ఇలా ఎందరో ! వీరంతా హిందూ ధర్మ స్థాపనకు, సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకు పెక్కు చర్యలు చేపట్టారు. వాటిల్లో ముఖ్యమైనది ఆలయ నిర్మాణాలు. వీరంతా అపురూపమైన దేవాలయాలను నిర్మించడంలో కీలక పాత్ర పోషించారు. నాటి సమాజంలోని అన్ని వర్గాలవారు, పండిత పామరులు ప్రతి ఒక్కరూ హిందూ సంస్కృతి, సంప్రదాయాలు, ఆరాధన విధానాలు, పురాణాల గురించి తెలుసుకొనే అవకాశం కలిగింది. దానివలననే నేటికీ మన సంప్రదాయాలు చెక్కుచెదరకుండా నిలిచి ఉన్నాయి.       అదే విధంగా ఈ పాలకులంతా వివిధ కాలాలకు చెందినవారు.  అయినా ప్రతి ఒక్క రాజ వంశం తమకంటూ ఒక రాజ చిహ్నాన్ని, ధ్వజాన్ని, కులదైవాన్ని ఏర్పాటు చేసుకొన్నారు. తమ ఆరాధ్య దైవానికి నిర్మించిన ఆలయాలలో తమ రాజ చిహ్నాన...