Saptha mangai Sthalams

నవరాత్రులతో ముడిపడి ఉన్న సప్త మాంగై స్థలాలు నిరాకారుడైన నటరాజ స్వామికి భువిలో పెక్కు ఆలయాలున్నాయి. ఇవన్నీ కూడా భక్తులకు దర్శనమాత్రానే ఇహపర సుఖాలను అనుగ్రహించేవి కావడం విశేషం. వీటిల్లో మరింత ప్రత్యేకమైనవి సప్త మాంగై స్థలాలు . అర్ధనారీశ్వరతత్వానికి ప్రతీక ఈ క్షేత్రాలు. పావన కావేరీ తీరంలో, విశేష ఆలయాలకు చిరునామా గా ప్రసిద్ధికెక్కిన తంజావూరు చుట్టుపక్కల ఉన్న ఈ ఏడు క్షేత్రాలను భక్తులు నవరాత్రుల సందర్బంగా పెద్ద సంఖ్యలో దర్శించుకొంటుంటారు. కారణం అమ్మలగన్నయమ్మ పార్వతీ దేవి నవరాత్రులలో నిర్ణయించబడింది ఆలయాలను రోజుకొకటి చొప్పున సందర్శిస్తూ అక్కడ కొలువైన సర్వేశ్వరుని సేవించుకొంటారు...