గుహాయ్ నమః శివాయ తలచినంతనే ముక్తిని ప్రసాదించే మహిమాన్విత క్షేత్రం తిరువణ్ణామలై. మరి అక్కడే ఉంటూ ప్రతి నిత్యం అరుణాచలేశ్వరుని ఆరాధిస్తూ, ఆయన సేవలో పరవశిస్తూ అనుగ్రహానికి పాత్రులైన ముముక్షువులు ఎందరో ! అలాంటి వారిలో తొలి తరం వారు శ్రీ గుహాయ్ నమః శివాయ. ఈయన కర్ణాటక రాష్ట్రంలో 1548 వ సంవత్సరంలో జన్మించారు . తల్లితండ్రులు ఆచారవంతులు శివ భక్తులు . చిన్నప్పటి నుంచి ఈయన ఆధ్యాత్మిక ఆలోచనలతో , మౌన ధ్యానాలతో గడిపేవారట . కన్నవారి అనుమతితో శ్రీశైలం చేరి వీరశైవుడైన శ్రీ శివానంద దేశికర్ను ఆశ్రయించారు . గురువు దగ్గర దీక్ష తీసుకొని , భక్తి శ్రద్దలతో సేవించేవారు . శివానంద దేశికర్ యోగ విద్యలో నిష్ణాతులు . శిష్యుని ...