Swetharka Sri Hanuman Temple, Machilipatnam

శ్రీ సువర్చలా సహిత శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం శ్రీ గణపతి, శ్రీ దుర్గ, శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామ చంద్ర స్వామి, శ్రీ హనుమంతుడు వీరి ఆలయాలు లేని ఊరు భారత దేశంలో కనపడదు. ముఖ్యంగా రామదూత హనుమాన్ శివకేశవ బేధం లేకుండా అన్ని ఆలయాలలోనే కాదు, పెద్ద పెద్ద వటవృక్షాల క్రింద, రహాదారుల ప్రక్కన అడుగు రూపం నుండి వంద అడుగుల విరాట్రూపాలలొ కనపడుతుంటారు. వానర వీరుడు కేసరికి, అంజనా మాతకు వాయుదేవుని అంశతో జన్మించిన మారుతి,రుద్రాంశగా పేర్కొంటారు. వాయునందనుడు వరపుత్రునిగా జన్మించిన అంజనాద్రి ప్రఖ్యాత చారిత్రక ప్రదేశం అయిన హంపీ దగ్గరలోని అనెగొంది. విజయనగర రాజుల తొలి రాజధాని. తుంగభద్రా నాదీ తీరంలో, పంపా సరోవరానికి చేరువలో ఉన్న అంజనాద్రి పర్వతం మీద శ్రీ అంజనాదేవి ఆలయం ఉంటుంది. కోతి అంటే చంచలత్వానికి ప్రతీక. ఒక చోట కాలు నిలువదు. దానికి అవసరం లేక అనవసరం అనదగ్గ విషయం లేదు. అన్నింటిలో వేలు పెడుతుంది. మన మనసు కూడా అంతే కదా ! వానరం అత్యంత చంచలమైన మానవ ఆలోచనలకు, మనస్సుకు ప్రతిరూపం. హనుమంతుడు అనగా నిశ్చల భక్తికి, ఏకాగ్రతకు, స్పష్టతకు,...