శ్రీ జలకంఠేశ్వర స్వామి ఆలయం, వెల్లూరు
భారత దేశంలో ఎన్నో పురాతన కోటలు దర్శనమిస్తాయి. అవన్నీ వివిధ వంశాల రాజులు రాజ్య రక్షణ, ప్రజా క్షేమం కోరి నిర్మించినవి. కొన్ని ఆడంబరాలకు, మరికొన్ని విశ్రాంతి మందిరాలుగా కూడా ఉపయోగించబడినాయి.
ఎన్నో ప్రత్యేకతలకు ప్రసిద్ది చెందిన అవన్నీ నేడు ప్రముఖ సందర్శక ప్రదేశాలుగా మారి దేశ విదేశ పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి.
భౌగోళికంగా తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్ మరియు కర్నాటక రాష్ట్రాలను సరిహద్దులలో ఉంటుందీ పట్టణం.
పూర్వ కాలంలో రాజకీయంగా అత్యంత కీలక సైనిక స్థావరంగా పరిగణించ బడినది.
ఈ ఊరి చరిత్రలానే పేరు కూడా ఎన్నో కధలను తెలుపుతుంది.
తమిళ సంగమ కాల రచనల ప్రకారం కొన్ని శతాబ్దాల క్రిందట "వేలన్" అనే వృక్షాలతో నిండి ఉండేదట. అలా వేలూరు వచ్చినది అని పేర్కొనబడినది. వేలన్ అంటే తెలుగులో నల్ల తుమ్మ చెట్టు.
ప్రముఖ శివ భక్తుడు, కవి, గాయకుడు అయిన "అరుణ గిరి నాథర్" ఇక్కడికి సమీపంలోని తిరువన్నమలై దివ్య క్షేత్రంలో నివాస మున్నారు. అక్కడే ఆయనకు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి సాక్షాత్కారం లభించినది. ఆయన కూడా తన కీర్తనలో ఈ క్షేత్రాన్ని వేలూరు అనే ఉదహరించారు.
ఈ వంశానికి చెందిన సదాశివ రాయలు కట్టించినదే వేలూరు కోట. రాజుగారి ఆదేశం ప్రకారం సామంత రాజైన "చిన్ని బొమ్మ నాయకుడు" 1566 వ సంవత్సరంలో నిర్మించాడు అని శాసనాలు తెలియజేస్తున్నాయి.
అత్యంత ఊహాత్మక, దుర్భేద్యమైన, సంపూర్ణ రక్షణ నిచ్చే కోటగా చరిత్రకారుల ప్రశంసలు పొందిన కోట.
మైసూరు పాలకుడు టిప్పు సుల్తాన్ ఆంగ్లేయులతో జారిన యుద్దంలో మరణించాడు. ఆయన తల్లి, భార్య మరియు కుమారులను ఇక్కడ బంధించారు.
మత సంబంధిత వస్తువులను ధరించరాదు. విశ్వాసాలకు అతీతంగా మీసం గడ్డం లేకుండా ఉండాలి. తలపాగాలను తీసి వేసి ప్రత్యేకంగా తయారు చేసిన టోపీలను పెట్టు కోవాలి అని అధికారులు ఆదేశించారు.
అదే సమయంలో టోపీలు ఆవు లేదా పండి చర్మాలతో తయారు చేసారు అన్న వార్త ప్రబలింది. అప్పటికే అసహనంతో రాలుగుతున్న సైనికుల సహనం ఈ వార్తతో పూర్తిగా హద్దులు దాటింది.
ఒకరకంగా ఇది ఆంగ్లేయుల మీద భారతీయుల తొలి తిరుగుబాటుగా పేర్కొనవచ్చును.
శ్రీలంకను పాలించిన ఆఖరి నాయక రాజ వంశపు పాలకుడు "శ్రీ వికారం రాజ సింఘే" ఆంగ్లేయులతో జరిగిన పోరాటంలో ఓడిపోయి పట్టుపడ్డారు. ఆయనను కుటుంబంతో సహా భారత దేశానికి తెచ్చి వేలూరు కోటలో బంధించారు
అనారోగ్యంతో కొన్ని సంవత్సరాల నిర్బంధం అనంతరం ఆయన ఈ కోట లోనే తుది శ్వాస విడిచారు. పాలారు నది వడ్డున ఉన్న "ముత్తు మండపం"లో ఆయన సమాధిని సందర్శించవచ్చును.
కోటకు ఎంత చరిత్ర ఉన్నదో అంతకన్నా ఎక్కువ ఈ ఆలయానికి ఉన్నది అని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి.
తొలుత పల్లవులు, పాండ్యులు, చోళులు ఈ ఆలయ నిర్మాణాన్ని అంచెలంచెలుగా చేపట్టారు.
కోట నిర్మించిన తరువాత చిన్నిబొమ్మి నాయుడు రాజానుమతితో ఆలయ నిర్మాణం చేపట్టారు. అందుకే అణువణువునా విజయనగర నిర్మాణశైలి ప్రస్పుటంగా కనపడుతుంది.
కోటలో దాదాపుగా ఈశాన్య భాగంలో కొద్దిగా క్రిందకి ఉండే ఈ ఆలయానికి అయిదు ప్రాకారాలు ఉంటాయి.
వెలుపలి ప్రాకారానికి దక్షిణాన ఏడు అంతస్థుల రాజగోపురం దానికి అనుసంధానంగా ఎత్తైన గోడలు. ఈ గోడల మీద నంది మరియు శృంగి బృంగి రూపాలను చెక్కారు.
రాజగోపురం వద్ద ఆలయ చరిత్రను ఆంగ్ల మరియు తమిళ భాషలలో లిఖించి భక్తుల సౌకర్యార్ధం ఉంచారు.
రెండో ప్రాకారంలో మరో గోపురం ఉంటుంది. మరో వరుస ప్రహరి గోడలను నిర్మించారు. వాటి మీద కూడా నంది గణపతి, ప్రమధ గణాల రూపాలను చెక్కారు.
దక్షిణ భారత దేశంలోని ఆలయాలలో మధురై ,హంపి, తిరునెల్వేలి, కోయంబత్తూర్ సమీపంలోని పేరూర్ లోని ఈశ్వరన్ కోవెల లలోని కళ్యాణ మండపాలు అత్యంత సుందరమైనవిగా ప్రసిద్ది.
శ్రీ జలకంటేశ్వర స్వామి ఆలయం లోని కళ్యాణ మండపం వాటితో సరి పోల్చతగినది.
ఆంగ్లేయులు ఈ శిల్ప సౌందర్యానికి పరవశులై మండపాన్ని ముక్కలు ముక్కలుగా విడగొట్టి ఇంగ్లండు తరలించడానికి పధకం రచించారు. దానికి రాణీ గారి అనుమతి కూడా లభించినదట. కానీ కొన్ని అనుకోని ఘటనల వలన వారు ఈ తరలింపు యత్నాన్ని విరమించుకోన్నారట.
కొద్దిగా ఎత్తులో ఉండే వేదిక పైన చెక్కిన కూర్మ సింహాసనం ఒక అద్భుతం.
అదే కాదు ఈ మండపానికి అనుబంధంగా ఏర్పరచిన అలంకార మండపాలు మరియు ఆగ్నేయం లో ఉన్న వసంత మండపం దాకా అన్ని వీక్షకులను చకితులను చేస్తాయి.
పైకప్పుకు చెక్కిన పెద్ద పెద్ద పుష్పాలు మరింత మురిపిస్తాయి.
అపురూప శిల్పాలను, అతి సూక్ష్మ చెక్కడాలతో నిండిన ఈ మండపాన్ని అంగుళం అంగుళం వర్ణించడం ఎవరికైన అసాధ్యం. సందర్శించడమే మార్గం !
ఎడమ పక్కన ఉన్న మూడు ఉపాలయాలలొ శ్రీ సిద్ది గణపతి, శ్రీ తిరుమల బాలాజీ, శ్రీ వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్య స్వామి కొలువుతీరి ఉంటారు.
ఎదురుగా నవ అఖండ దీపాలు వెలుగుతుంటాయి. ఇవి నవగ్రహాలకు ప్రతి అని చెబుతారు.
ఇక్కడ మండపంలో పికప్పుకు కంచి లో మాదిరి బల్లులను చెక్కారు. మనిషికి రెండు రూపాయలు చెల్లించి తాక వచ్చును.
తూర్పు ముఖంగా ఉన్న ఆలయానికి అటు ద్వారం ఉండదు. ఉత్తరం వైపు నుండి ప్రధాన ఆలయం లోనికి ప్రవేశించాలి.
ముఖ మండపంలో నిలువెత్తు ద్వారపాలకులు, నంది.
అర్ధమండపంలో మరో నంది. ఎదురుగా గర్భాలయంలో విరాట్ లింగరూపంలో శ్రీ జలకంటేశ్వర స్వామి.
నేడు ప్రతి నిత్యం ఎన్నో అభిషేకాలు పూజలు జరుగుతున్న ఈ ఆలయంలో 1981 వ సంవత్సరం వరకూ చాలా సంవత్సరాలు ఎలాంటి పూజలూ జరిగేవి కావు అస్సలు ఎలాంటి దేవతా మూర్తు ఉండేవి కావు అని తెలిస్తే నమ్మశక్యం కాదు. కానీ నిజం. ఎవరి పాలనలో జరిగిందో కానీ అన్ని విగ్రహాలను తీసివేసారు.
భక్తులు ఎన్నో ప్రయాసలు పది చివరి 16. 03. 1981 న పునః ప్రతిష్ట చేసారు.
ఇన్ని విశేషాల శ్రీ జలకంటేశ్వర స్వామి ఆలయం వేలూరు పట్టణం నడి బొడ్డున ఉన్న "కొట్టై " (స్థానికంగా కోట ను అలా అంటారు.)లో ఉంటుంది.
ప్రముఖ కూడలి అయిన "కాట్పాడి" రైల్వే స్టేషన్ కు మూడు కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది.అన్ని సదుపాయలు లభిస్తాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి