శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మి అమ్మవారి ఆలయం, అడిగొప్పల అమ్మలగన్న అమ్మ లోకపావని శ్రీ పార్వతీ దేవి దేశం నలుమూలలా ఎన్నో పేర్లతో వివిధ క్షేత్రాలలో కొలువు తీరి భక్తుల సేవలను అందుకొంటున్నారు. అలాంటిదే "నిదానంపాడు అగ్రహారం". నేడు గ్రామం లేకున్నాపొలాల మధ్య అమ్మవారు స్థిర నివాసం ఏర్పరచుకొని దశాబ్దాలుగా నమ్మిన వారిని అనుగ్రహిస్తున్నారు. ముగురమ్మల మూలపుటమ్మ ఇక్కడ పదకొండు సంవత్సరాల బాలిక రూపంలో దర్శనమివ్వడానికి సంబంధించిన గాధ తాలూకు ఆరంభం యుగాల క్రిందటిదిగా తెలుస్తోంది. చివరికి కలియుగంలో అమ్మవారు ప్రకటితమవ్వడంతో ముగిసింది అని భావించవచ్చును. ఒకనాడు కైలాసంలో నటరాజు ఆనంద తాండవం చేస్తుండగా ప్రమధ గణాలు కూడా ఆయనతో నర్తించ సాగారట. ఆ అపురూప సందర్భంలో నంది కూడా తనకు తెలిసిన విధంగా నృత్యం చేయసాగాడట. అది చూసి పార్వతీ దేవి పగలబడి నవ్వసాగారట. అక్కడే ఉన్న నంది తండ్రి "శిలాద మహర్షి" ఆగ్రహించి, "భక్తి భావంతో నర్తిస్తున్న నా కుమారుని తల్లిలా ఆదరించకుండా రూపం చూసి పరిహసించిన నీవు ...
శ్రీ కాశీ నాయన ఆలయం, జ్యోతి జ్యోతి, గిద్దలూరు కి సుమారు ౫౦ కిలోమీటర్ల దూరం లో ఉన్నది. వయా ఓబులాపురం మీదగా బస్సులు గిద్దలూరు నుండి ఉన్నాయి. ఇక్కడే ఆలయాలలో ఉచితన్నదాన కార్యక్రమ ప్రారంభ స్ఫూర్తి ప్రదాత అవధూత శ్రీ కాశి నాయన సమాధి చెందారు. కామధేను గోవు సమాధి, శివ, శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఇతర ఆలయాలు ఇక్కడ నిర్మించారు. ప్రస్తుతం కాశి నాయన సమాధి మీద ఎందరో అవధుతలు, మహా పురుషుల, యోగుల, మహారుషుల ,దేవతల శిల్పాల తో కూడిన ఒక మహా ఆలయాన్ని నిర్మిస్తున్నారు. చుట్టూ కొండలు, నల్లమల అడవులతో నిండిన చక్కని ప్రకృతి లో మసుకు ప్రశాంతి ని ప్రసాదించే పరిసరాల తో ఆహ్లాదకరంగా ఉండే జ్యోతి లో ప్రతి నిత్యం అన్నదానం జరుగుతుంది. అన్ని జీవులకు అన్నదానం కాశి నాయన సమాధి మందిరం శ్రీ కాశి నాయన శ్రీ కాశి నాయన పంచ లోహ మూర్తి నాయన పాదుకలు నిర్మాణం లో ఉన్న ఆలయం / శిల్పాలు నవగ్రహ మండపం ...
శ్రీ మందగిరి శ్రీ శనీశ్వర స్వామి, కనుమలోపల్లి ( సిద్ధవటం మండలం ) సమస్త లోకాలలోని జనుల మీద సమయం వచ్చినప్పుడు తన ప్రభావాన్ని చూపించే వాడు శని భగవానుడు. ఏదోరకంగా ఈయనను ప్రసన్నుని చేసుకోవాలని ప్రతి ఒక్కరూ తపన పడతారు. తైలాభిషేకాలు, దానాలు, జపాలు, ప్రదక్షిణలు ఇలా ఎన్నో చేస్తుంటారు. ప్రజలను ఇంతగా ఆందోళనకు ( ఒక రకంగా భయానికి ) గురిచేసే శనికి ఉన్న ఆలయాలు మాత్రం చాలా తక్కువ. ఉన్న వాటిల్లో కూడా సదా శివుడే లింగ రూపంలో మందేశ్వరునిగా అభిషేకాలు అందుకొంటారు. మన రాష్ట్రంలో ఉన్న ప్రముఖ శనీశ్వరాలయం తూర్పు గోదావరి జిల్లా మండవిల్లిలో ఉన్నది. ఇది కోస్తా జిల్లాల వారికి సదుపాయంగా ఉంటుంది. కాని రాయల సీమ వాసులు కడప, కర్నూల్, అనంత పురం వాసులు కర్నాటక రాష్ట్రంలో ఉన్న ప్రముఖ శని క్షేత్రం అయిన " పావగడ " వెళుతుంటారు. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి వెళ్ళే భక్తుల కొరకు స్థానికంగా ఒక శని భగవానుని ఆలయం నిర్మిస్తే బాగుంటుంది అన్న మంచి ఆలోచనతో ఒక భక్తుడు చేసిన పరిశోధన పలితమే శ్రీ మందగిరి శనీశ్వర స్వామి దేవస్థానము....
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి