Sri Veerabhadra Swamy Temple, Macherla

శ్రీ వీరభద్ర స్వామి ఆలయం, మాచర్ల మాచర్ల పట్టణంలో ఉన్న మరో పురాతన ఆలయం శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీర భద్ర స్వామి మరియు శ్రీ ఇష్టకామేశ్వర స్వామి ఆలయం. శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయానికి పక్కనే ఉంటుందీ ఆలయం. వెయ్యి సంవత్సరాల క్రిందట చోళ రాజులు ప్రతిష్టించిన శ్రీ ఇష్ట కామేశ్వర స్వామి ఆలయంలో సుమారు ఎనిమిది వందల సంవత్సరాల క్రిందట గ్రామ కరణం తమ ఇలవేల్పు అయిన శ్రీ వీరభద్ర స్వామిని ప్రతిష్టించి రాజ సహకారంతో ఆలయం నిర్మించారట. పురాతన గాలి గోపురం దాటి ప్రాంగణం లోనికి ప్రవేశిస్తే ఎదురుగా ధ్వజస్తంభం కనపడుతుంది. పక్కనే శ్రీ నాగేంద్ర సన్నిధి. చుట్టలు చుట్టలుగా ఉండే ఆరు అడుగుల నాగేంద్ర పడగలో సూక్ష్మ రూపంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి రూపాన్ని బహు చతురతతో చెక్కారు. ప్రాంగణంలో ఎన్నో నాగ ప్రతిష్టలు కనపడతాయి. ఆలయాన్ని నిర్మించిన శిల్పుల నాయకుని మూర...