Tiruvannamalai
శ్రీ అరుణాచలేశ్వర పంచ భూత క్షేత్రాలలో ఒకటి తిరువన్నామలై. సదా శివుడు పంచ భూతాలైన భూమి, నీరు, వాయువు, అగ్ని, ఆకాశాలకు అధిపతిగా అయిదు క్షేత్రాలలో లింగ రూపంలో కొలువై ఉన్నారు. అవి కాంచీపురం ( పృథ్వి ), జంబుకేశ్వరం ( నీరు), శ్రీ కాళహస్తి ( వాయువు), చిదంబరం ( ఆకాశం) కాగా తిరువన్నామలై లో ఉన్నది అగ్ని లింగం. స్వామి వారిని శ్రీ అరునాచలేశ్వరుడు అని పిలుస్తారు. అన్నామలై పర్వత పాదాల వద్ద ఉన్న ఈ క్షేత్రంలో ఏడాదికి నాలుగు సార్లు బ్రహ్మోత్సవాలు జరుపుతారు. తమిళ నెల కార్తీకంలో (నవంబరు/డిసెంబరు) జరిగే బ్రహ్మోత్సవాలు ప్రసిద్ధి చెందాయి. పది రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలు కార్తీక దీపం రోజుతో ముగుస్తాయి. ఆ రోజు సాయంత్రం, అన్నామలై కొండ మీద మూడు టన్నుల నెయ్యి వేసి ఓ పెద్ద జ్యోతి వెలిగిస్తారు. ప్రతి పౌర్ణమి నాటి రాత్రి, వేలకొలది భక్తులు అరుణాచల కొండ చుట్టూ వట్టి కాళ్ళతో ప్రదక్షిణాలు ...