7, నవంబర్ 2012, బుధవారం

Importence of Radha sapthami [ Radhasapthami pooja Mahima ]



                               రధ సప్తమి పూజ మహిమ  

                                                                                                    



అనేకానేక హిందూ పురాణాలూ , గ్రంధాలలో  పేర్కొన్న ఎందరో దేవి దేవతలలో లోకాలకు వెలుగును ప్రసాదించే శ్రీ సూర్య నారాయణ స్వామిని  ప్రత్యక్ష దైవంగా అభివర్నించాయీ అంటే కారణం ఆయనొక్కడే   ప్రతినిత్యం  దర్శనమిచ్చేది కనుక.
సృష్ట్యాది నుండి మన భారత భూమి లోనే కాకుండా చైనా,జపాన్, ఇండోనేషియా , నేపాల్, శ్రీలంక, ఈజిప్థ్గ్రీస్, రోమ్. లాంటి ఎన్నో దేశాలలో సుర్యారాధన ఉన్నదని లభించిన ఆధారలవలన తెలుస్తోంది.
.యాంగ్ ,అమతేరాసు , సురియ , ఇరుదేవియ, రాహిలియోస్  మరియు అపోలో గా ఒక్కో దేశంలో దివాకరుడు ఒక్కో పేరుతొ పిలవబడుతున్నాడు.
వేదకాలం నుండి పలు విధాలుగా ఆదిత్యుని సేవించుకోవడం హిందూ మతంలో ఒక సాంప్రదాయంగాను, ఒక ఆచారంగా స్థిరపడిపోయింది.
నిత్యం సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడం మరియు సూర్య నమస్కారములు వాటిల్లో కొన్ని.















కాని మారిన  యుగాధర్మానుసారం కలియుగంలో విగ్రహారాధన,   మానవులకు తప్పనిసరి అయిన క్రమంలో కొన్ని  పూజలు పెద్దలు నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.
 అలా నిర్ణయించిన  వాటిల్లో రధ సప్తమి పూజ ఒకటి.
అదితి, కశ్యప మహర్షి  దంపతులకు జన్మించిన ఆదిత్యుడు లోకాలకు వెలుగు మరియు కాలనిర్ణయం చేసే క్రమంలో పన్నెండు రాశులలో ఒక్కో దానిలో నెల  రోజుల చొప్పున ఉంటూ ఆరు నెలలకొకసారి తన గతిని మార్చుకుంటారు. దానినే దక్షిణాయనం , ఉత్తరాయణం అంటారు.
మకర సంక్రాంతి నుండి [ 15 జనవరి ]  జులై  పదిహేను వరకు దక్షిణాయనం , జూలై  నుండి తిరిగి సంక్రాంతి వరకు ఉత్తరాయణం.
అలా దివాకరుడు దిశ మారిన తరువాత వచ్చే మాఘ మాస శుక్ల పక్ష సప్తమినే  రధ  సప్తమి అని లేదా సూర్య జయంతి అని  అంటారు.
తరతరాలనుండి రధ సప్తమి జరుపుకోవడం హిందూ సాంప్రదాయం గా  వస్తోంది.
ఆ రోజున జరుపుకొనే సూర్య పూజకు విశేష విశిష్స్టత ఉన్నది.

పురాణగాధ :

రధ  సప్తమి నాడు నిర్వర్తించే  పూజకు సంభందించి  ఒక పురాణ గాధ ప్రచారంలో ఉన్నది.
పూర్వం కాంభోజ దేశాన్ని పాలించే యశో వర్మమహారాజుకు సంతానం లేకపోవడంతో ఘోర తపము చేయగా సంతుస్టుడైన సదాశివుడు రాజుకి పుత్రా సంతానాన్ని ప్రసాదించారు.
కాని జన్మించినది మొదలు ఆ బిడ్డ సదా అనారోగ్యం ఉండేవాడు.
సంతానం కలిగినా  బిడ్డ అనారోగ్యం  వలన ఆ ఆనందాన్ని పొందలేక రాజదంపతులు చింతించే వారు .
తన  పర్యటనలో భాగంగా కాంభోజ దేశానికొచ్చిన వినీత మహర్షిని సేవించిన యశో వర్మ దంపతులు తమ ఒక్కగానొక్క వంశాంకురం ఆరోగ్య పరిస్థితిని గురించి తెలిపి తరునోపాయాన్ని తెలుపమని ప్రార్ధించారు.
ముని తన దివ్యదృష్టితో చూసి రాజదంపతులకు వారి కుమారుడు గత జన్మలో చేసిన పాపాలకు ఫలితాన్ని ఈ జన్మలో ఇలా అనుభవిస్తున్నాడని దీనికి సరియన పరిస్క్హారం సుర్యారాధనతోనే లభిస్తుందనీ,ఆదిత్యుని ఆరాధన సమస్త పాపాలను నిర్మూలించడమే కాకుండా ఆరోగ్యాన్ని ప్రసాద్తిస్తుందని, ఆ పూజ విధాన్నాన్ని తెలిపారు.
మహర్షి చెప్పిన విధంగా రధ సప్తమి నాడు ప్రత్యక్ష నారాయణుని పూజ  చేయడంతో వారి కుమారుడు సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాడు.

రధ  సప్తమి పూజా విధానం :

సూర్య జయంతి నాడు వేకువనే అంటే తొలి కిరణాలు భూమిని తాకక ముందే నిద్ర లేచి, కాలకృత్యాలు తీర్చుకొని పారుతున్న నీటిలో అనగా నది లేదా  కాలువలోతలమీద ఒకటి, భుజాల మీద, మోకాళ్లమీద , పాదాల మీద రెండేసి చొప్పున  మొత్తం ఏడు జిల్లెడు ఆకుల నుంచుకొని  స్నానమాచరించి, గాయత్రీ మంత్రాన్ని పఠిస్తూ సూర్యునికి అర్ఘ్యమివ్వాలి.
అనంతరం గృహములో తూర్పుదిశగా   రధము ముగ్గు వేసి అందులో భాస్కరుని మూర్తిని గాని, పటాన్నిగాని పెట్టి ,పెద్దలకు మ్రొక్కి, కుల దైవాన్ని ఆరాధించి, శాస్త్రోక్తంగా సూర్య నారాయణుని ఎఱ్ఱని పూలతో పూజించాలి.
నైవేద్యముగా పొంగలిని సమర్పించాలి.
ఆ రోజంతా ఉపవాసముండి, నిర్మల మనస్సుతో ఆదిత్య హృదయాన్ని పటించాలి.
సాయం సంధ్యా సమయంలో తిరిగి స్నానమాచరించి, పూజా స్థలిలో  దీపారాధనచేసి, ఆలయ దర్శనము చేసి, పొంగలిని స్వీకరించి  ఉపవాస విరమణ చేయాలి.
దీనివలన ఆరోగ్యము, దీర్ఘాయుషు  మరియు ఐశ్వర్య ప్రాప్తి లభిస్తాయి.

 సూర్యారాదనలో  ఇమిడివున్న  ఆరోగ్య సూత్రాలు :

హిందూ మతంలో పూజా విదానాలన్నింటిలో అంతర్గతంగా ఆరోగ్య సూత్రాలు పొందుపరచబడి ఉంటాయి.
సుర్యారాదనలో కూడా ఎన్నో ఆరోగ్యాభివృద్ధిని కలిగించే మర్మాలు దాగిఉన్నాయి.
వేకువనే నిద్ర  లేవడం వలన రోజంతా ఉత్సాహంగా ఉండచ్చును.
పారే నీటిలో స్నానమాచరించడం వలన మలినాలు తొలగిపోయి  శరీరం శుభ్ర పడుతుంది.
సూర్య నమస్కారలవలన , శరీరాన్ని తాకే నులివెచ్చని అరుణ కాంతితో చర్మము కాంతివంతంగా మారుతుంది.  ఎముకలు బలపడి  శారీరక ధృడత్వం కలుగుతుంది.
ఉపవాస మూలంగా శరీరంతర్భాగాలకు తగిన విశ్రాంతి  లభిస్తుంది. తద్వారా జీర్ణశక్తి పెరిగి, శరీరానికి కావలసిన పోషకాలు లభించడం వలన చురుకుగా ఉండవచ్చును.
ఆదిత్య హృదయం ఫటించుట వలన మానసిక స్థిరత్వం కలిగి, ముఖ్య విషయాలలో సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు. అన్నింటా విజయం లభిస్తుంది.
పూజ వలన ఏకాగ్రత, శ్రద్ధా భక్తులు నెలకొంటాయి.
ఆలయ దర్శనం వలన మానసిక ఆనందం, ఆధ్యాత్మిక అవగాహన చేకూరుతుంది.
 ఇలా దైనందిన జీవితాన్ని సుఖమయం చేసుకొనే అనేక ఆవశ్యక సూత్రాలను పూజ విధానాల ద్వారా భావి తరాలకు అందించిన మన పూర్వీకులు చిరస్మరనీయులు.
ఏ తరానికైనా, కాలానికైనా సరిపడే విధంగా వారు రూపొందించి అందించిన విధివిధానాలను పాటించి మన జీవితాలలో సుఖశాంతులను నెలకొల్పె, మనవైన ఆచారాలను గౌరవించడం మనం వారికిచ్చే నిజమైన నివాళి.




















కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Only One Brahma Temple, Chebrolu

  శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర  స్వామి ఆలయం       లోకాలను పాలించే త్రిమూర్తులలో లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు శ్రీ సదాశివుడు లోక...