Thirumittakode

శ్రీ వైష్ణవ నూట ఎనిమిది దివ్య దేశాలలో కేరళలో కల పదకొండు దేశాలలో ఒకటి అయిన తిరుమిత్త కోడ్, పముఖ శ్రీ కృష్ణ క్షేత్రము అయిన గురువాయురికి సుమారు ఇరవై కిలమీటర్ల దూరంలో, రాష్ట్రం లో రెండో పెద్ద నది అయిన భరత్ పుళ ఒడ్డున అత్యంత ప్రశాంత వాతావరణంలో, ఆధ్యాత్మిక భావాలను పెంపొందించే ప్రత్యేకతలతో, ఎన్నో యుగాల పౌరాణిక , చారిత్రక విషయాలకు చిరునామాగా నిలిచివుంది.











మరే ఆలయంలో లేని విధంగా ఒకే ప్రాంగణంలో శ్రీ హరి నాలుగు రూపాలలో మరియు లయకారుడైన పరమశివుడు లింగరూపంలో కొలువైన ఒకే ఒక్క క్షేత్రం ఇది . హరిహరుల నిలయం.
ఆ కారణంగా దీనిని అంజు మూర్తి ( ఐదు మూర్తుల )ఆలయం అని  స్థానికంగా పిలిస్తారు.
గతంలో అంబరీష మహారాజు సంతానం కోసం ఒకసారి, మరోసారి శ్రీమన్నారాయణుని నాలుగు రూపాలైన ప్రదుమ్న్య, అనిరుద్ధ, సంఘర్షణ మరియు పరవసుదేవ లుగా దర్శించుకోవాలని తపమచారించారట.
అలా ఆయనకు సాక్షాత్కరించిన పెరుమాళ్ ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్నారట.
ద్వాపరయుగంలో పంచ పాండవులు తమ దక్షిణ దేశ యాత్రలో వచ్చి మునుల ద్వారా క్షేత్ర పురాణం తెలుసుకొని వైకుంఠ వాసుని సేవించారట.













తదనంతర కాలంలో ఒక పండితుడు కాశి నుండి స్వగ్రామం వెళుతూ నంది వాహనుని తనవేంటే వుంది కాపాడమని కోరి ప్రయాణ మార్గంలో ఇక్కడ సాయంసమయ పూజల కోసం ఆగి తన గోడుగుని వుంచి పూజానంతరం తిరిగి తీసుకోబోగా అది రాక పోగా స్వయంభూ లింగం ఉద్భావించినదట.
ప్రస్తుత ఆలయాన్ని చేర రాజులు నిర్మించారట.
గర్భాలయ గోడలకు చక్కని వర్ణ చిత్రాలున్నాయి.












వైకుంఠ ఏకాదశి వైభవంగా జరుపుకుంటారు.
కులశేఖర ఆళ్వారు ఇక్కడి పరమాత్మ మీద పాశురాలు గానం చేసారు.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Sri Kasinayana Temple, Jyothi, AP

Sri Irukalala Parameswari Temple, Nellore

Sri Omkara Siddeshwara Swamy Temple, Omkaram