25, డిసెంబర్ 2012, మంగళవారం
5, డిసెంబర్ 2012, బుధవారం
palayur- syro-malabar catholic church
పలయూర్ - ప్రచారకుని ప్రధమ మజిలి
= ఇలపావులూరి వెంకటేశ్వేర్లు
"భారత దేశము నా మాత్రు భూమి, భారతీయులందరూ నా సహోదరులు." అంటూ కారు దిగి లోపలికి నడుస్తూ నా కేరళా మిత్రుడు శయన్ తో అన్నాను.
దీనికి నేపద్యం ఏమిటంటే ప్రతి సంవత్సరం మాదిరిగానే శబరిమల యాత్ర చేసుకొని తిరుగు ప్రయాణంలో గురువాయూర్ వచ్చాము నేను, నే ఇద్దరు మిత్రులు.
అక్కడ ఉండే శయన్ మమ్ములను రిసీవ్ చేసుకొని తన కారులో గురువాయూర్ లోని కొన్ని పురాతన ఆలయాలను చూపిస్తున్నప్పుడు నేను పలయూర్ చర్చి గురించి అడిగి, చూడాలని ఉన్నది అన్నాను.
నా వంక అదోలా చూస్తూ" నువ్వా !" అన్నదానికి నా సమాధానమే పైన చెప్పినది.
దానికి తను కూడా నవ్వుతూ మాతో పాటు నడిచాడు.
గమనించవలసిన అంశం ఏమిటంటే ప్రస్తుతం ఈ దేశం లోని ప్రజలు ఎన్నో కులాలు, మతాలు, రకరకాల భగవద్ ఆరాధనా విధానాలను ఆచరిస్తున్నా మనందరి మూలాలు ఒక్కటే అనే సత్యాన్ని తెలిపే చారిత్రాత్మిక ప్రదేశం పలయూర్.
ప్రసిద్ద వైష్ణవ క్షేత్రం గురువాయూర్, సందర్శించిన పలితం దక్కాలంటే తప్పక దర్సించాల్సిన మమ్మియూర్ మహాదేవ మందిరం, ఎన్నో చరిత్ర కందని ఆలయాలు, కొదంగాల్లుర్ దగ్గరలో ఏడో శతాబ్దంలో హిందూ నిర్మాణ శైలిలో నిర్మించబడిన భారతదేశ తొట్ట తొలి జూమ మసీదు అయిన చేరమాన్ జూమా మసీదు దీనికి సాక్ష్యం గా నిలుస్తాయి.
దానికి తను కూడా నవ్వుతూ మాతో పాటు నడిచాడు.
గమనించవలసిన అంశం ఏమిటంటే ప్రస్తుతం ఈ దేశం లోని ప్రజలు ఎన్నో కులాలు, మతాలు, రకరకాల భగవద్ ఆరాధనా విధానాలను ఆచరిస్తున్నా మనందరి మూలాలు ఒక్కటే అనే సత్యాన్ని తెలిపే చారిత్రాత్మిక ప్రదేశం పలయూర్.
ప్రసిద్ద వైష్ణవ క్షేత్రం గురువాయూర్, సందర్శించిన పలితం దక్కాలంటే తప్పక దర్సించాల్సిన మమ్మియూర్ మహాదేవ మందిరం, ఎన్నో చరిత్ర కందని ఆలయాలు, కొదంగాల్లుర్ దగ్గరలో ఏడో శతాబ్దంలో హిందూ నిర్మాణ శైలిలో నిర్మించబడిన భారతదేశ తొట్ట తొలి జూమ మసీదు అయిన చేరమాన్ జూమా మసీదు దీనికి సాక్ష్యం గా నిలుస్తాయి.
చేతిలోని కెమెరాను సర్దుకుంటూ పరిసరలన్నింటిని గమనిస్తూ పలయుర్ సైరో - మలబార్ కాథలిక్ చర్చి గురించి చదివినవి, విన్నవి గుర్తుకుతెచ్చుకొన్నాను.
సెయింట్ థామస్ - భారత దేశంలో తొలి అడుగు
జీసస్ క్రీస్తుకు అత్యంత సన్నిహితులైన పన్నెండుమందిలో ( వీరినే Apostle అంటారు ) ఒకరైన సెయింట్ థామస్, ఈయననే సందేహ ప్రాణి ( డౌటింగ్ థామస్ ) అని కూడా పిలుస్తారు.
క్రీస్తుకు శిలువ వేసిన తరువాత ఆయన సిద్ధాంతాలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయాలన్న ఆకాంక్షతో బయలుదేరారట.
ఆ పర్యటనలో ఇజ్రాయిల్ చేరుకొని, కొంతకాలముంది, అప్పటికే భారతదేశంతో వ్యాపార సంభంధాలు ఏర్పరచుకొన్న అక్కడి వ్యాపారస్తులతో కలిసి తన తొలి అడుగును కేరళలోని క్రాన్గానోర్ ( నేటి కొదంగాల్లూరు ) లో క్రీస్తు శకం యాభై రెండో సంవత్సరంలో మోపారు.
తరవాత పలయూర్ చేరుకొన్నారు. తన మహిమలతో ( సింహం, ఏనుగు, పులి లాంటి అడవి జంతువులను కంటి చూపుతో వశంచేసుకోవడం లాంటివి) స్థానికులను సంభ్రమాశ్హర్యాలకు లోను చేసి చాలా మందిని క్రిస్తవులుగా మార్చారు. నాడు కేరళ లోని కొందరు పాలకులు కూడా థామస్ భోధనలకు ప్రభావితులై ఆయనను అనుసరించారట.
కొంత కాలం కేరళలోనే ఉండి, తమిళనాడు లో ప్రభోధనలు చేస్తూ మద్రాసు చేరుకొని నేటి మీనంబాకం విమానాశ్రయం దగ్గరలోని సెయింట్ థామస్ మౌంట్ గా పిలవబడుతున్న కొండమీద ఉంటూ ఉండగా ఆయన చేస్తున్న మత ప్రచారానికి ఆగ్రహించిన వారు ఒకనాడు ప్రార్ధనలో ఉన్న థామస్ ను పొడిచి చంపేసారట. ఆయన స్మారకార్ధం ఒక ప్రార్ధనా మందిరం అక్కడ, సైదాపేట దగ్గర లోని చిన్న మలై లోను నిర్మించారని తెలుస్తోంది.
భారత దేశ ప్రభుత్వం థామస్ గౌరవార్ధం రెండు తపాల బిళ్ళలను ప్రవేశ పెట్టినది.
భారత దేశంలో మొత్తం పదిహేడు సంవత్సరాలు ఉన్న థామస్ ఏడు పూర్తి స్థాయి చర్చి లను, ఒక ప్రార్ధనా మందిరాన్ని ఏర్పాటు చేసారు. వాటిల్లో మిగిలినవన్నీ మారిపోగా, ఆయన నిర్మించిన స్థలంలో ఉన్న ఒకేవక్క చర్చి పలయూర్ లోవున్నదే.
మన దేశంలోని అత్యంత పురాతన మైన చర్చి కూడా ఇదే.
భారత దేశంలో క్రైస్తవ మతాన్ని ప్రవేశపెట్టినవాడు సెయింట్ థామస్.
మహిమలతో మారిన విశ్వాసాలు
కొదంగాల్లురు నుండి పడవలో నీటి మార్గం ద్వారా పలయూర్ చేరుకోన్నారట సెయింట్ థామస్.
ఆ నాడు పలయూర్ ఒక బ్రాహ్మణ అగ్రహారం.
వారు నిత్యం తమ పూజా విధానాలలో భాగంగా సూర్యునికి అర్ఘ్యం ఇస్తూవుందేవారట.
వారు పైకి విసిరిన అర్ఘ్యం తాలూకు జలం తిరిగి క్రింద పడిపోతుండేదట.
అదిచూసిన థామస్ వారితో " మీ పూజలను మీ దేవుడు స్వేకరించడంలేదు. అందుకే నీరు క్రింద పడుతోంది. కాని మేము నమ్మిన దైవం దానిని స్వీకరిస్తారు. కావాలంటే నిరుపిస్తాను." అని సవాలు విసిరారట.
దానికి సరేనన్న బ్రాహ్మణుల ముందు తన చేతిలోని నీటిని గాలిలోకి విసరగా అవి అలానే నిలిచిపోడమే కాక గులాబీ పుష్పాలుగా మారిపోయాయట.
దాంతో నిర్ఘాంతపోయిన స్థానికులలో కొందరు థామస్ వద్ద బాప్తిసం తీసుకోన్నారట.
అలా నీరు పువ్వులుగా మారిన స్తలమే నేటి తాలియకులం.
ఇక్కడ నలభై ఐదు అడుగుల సెయింట్ థామస్ విగ్రహం ఉంటుంది.
ప్రక్కనే మ్యూజియం ఉంటుంది.
తమలో కొందరు మత మార్పిడికి పాలుపడతంతో దానిని జీర్ణించుకోలేని మిగిలినవారు పలయూరును "శాపకాడు"గా నిందించి అక్కడినుండి వేరే ప్రాంతాలకు వెళ్లిపోయారట.
కొంతకాలానికి శిధిలమైన హిందూ దేవాలయం మీద చర్చిని నిర్మించారట.
పురాతన ఆలయ శిధిలాలలో కొన్నింటిని నేటికి ఇక్కడ చూడవచ్చు.
తదనంతర కాలంలో అనేక మార్పులు చోటుచేసుకొన్నా, ప్రస్తుత నిర్మాణాన్ని ఇటలీకి చెందిన ఫాదర్ ఫెనికో పదహారువందల ఏడో సంవత్సరంలో నిర్మించారని తెలుస్తోంది.
పురాతన ఆలయ శిధిలాలలో కొన్నింటిని నేటికి ఇక్కడ చూడవచ్చు.
తదనంతర కాలంలో అనేక మార్పులు చోటుచేసుకొన్నా, ప్రస్తుత నిర్మాణాన్ని ఇటలీకి చెందిన ఫాదర్ ఫెనికో పదహారువందల ఏడో సంవత్సరంలో నిర్మించారని తెలుస్తోంది.
పలయూర్ చర్చి విశేషాలు
గురువాయూర్ కి మూడు కిలోమీటర్ల దూరంలో చవక్కాడ్ బీచ్ దారిలో పల యూర్ ఊరికి పడమర దిశలో ఉన్న చర్చి రెండు భాగాలుగా ఉంటుంది.
ఒక భాగంలో తాలియకులం, బోటు కులం,సెయింట్ థామస్ విగ్రహం, మ్యూజియం ఉంటాయి.
రెండో భాగంలో చెర్చిఉంటుంది.
పడమర, దక్షినాలలో రెండు గేట్లు ఉంటాయి.
దక్షిణ ప్రవేశ ద్వారానికిరుప్రక్కలా ప్రాంగనంలో పదునాలుగు రాతి బొమ్మల రూపంలో థామస్ జీవితంలోని ముఖ్య ఘట్టాలను పెట్టారు.
టవర్ లాగా నిర్మించిన భాగం తప్ప మిగిలిన నిర్మానమంతా కేరళా శైలిలోనే నిర్మింపబడినది.
పెంకులతో నిర్మించిన మండపంలో సెయింట్ థామస్ శిలువను ప్రతిష్టించారని చెబుతారు. దానికి గుర్తుగా అక్కడ ఒక బౌద్ధ స్థూపం లాంటి నిర్మాణం పైన శిలువను ఉంచారు.
సందర్శకులు ఇక్కడ ప్రార్ధనలు చేసుకోవడం, బైబిల్ చదువుకోవడం చేస్తుంటారు.
ప్రధాన ప్రార్ధనా స్థలికి వెళ్ళే దారిలో టేకు చెక్కమీద బైబిల్ లో ఉదహరించిన ఘట్టాలను సుందరంగా చెక్కిన జూబ్లి డోర్ దర్శనమిస్తుంది.
డోమ్ లాగా నిర్మించిన పైకప్పు మీద వివిధ వర్ణ చిత్రాలను అందంగా చిత్రించారు.
లోపలి భాగంలో నలుపక్కల యేసు క్రీస్తు, మేరిమాత, సెయింట్ థామస్ మరియు ఇతర సెయింట్స్ మూర్తులను చక్కగా అమర్చారు.
శుభ కార్యాలప్పుడు, పర్వదినాలలో ప్రార్ధనలు చేస్తారిక్కడ.
పడమర వైపున పురాతన ఆలయ శిధిలాలు, చర్చి అధ్వర్యంలో నడుపుతున్న స్కూల్, చర్చి అభివృద్ధికి తోడ్పడిన ప్రముఖుల సమాధులను సందర్సించుకొని, మొదటి భాగమైన మ్యూజియం వైపుకు వచ్చాము.
ఇక్కడ ఎన్నో చారిత్త్రాత్మిక వస్తువులు, సెయింట్ థామస్ వాడిన వస్తువులు ఉన్నాయని తెలిసింది.
చూద్దమనుకోన్నాము.
కాని టైం అయిపోవడంతో మూసేసారు.
బాధనిపించింది.
ఫోటోలు తీసుకొని బయటికి వచ్చి కారు ఎక్కుతూ ఎన్నో చారిత్రిక అంశాలకు చిరునామా అయిన పలయూర్ చర్చి వంక తృప్తిగా చూస్తూ ఉండగానే శయన్ వాహనాన్ని ముందుకు నడిపాడు.
ఒక భాగంలో తాలియకులం, బోటు కులం,సెయింట్ థామస్ విగ్రహం, మ్యూజియం ఉంటాయి.
రెండో భాగంలో చెర్చిఉంటుంది.
పడమర, దక్షినాలలో రెండు గేట్లు ఉంటాయి.
దక్షిణ ప్రవేశ ద్వారానికిరుప్రక్కలా ప్రాంగనంలో పదునాలుగు రాతి బొమ్మల రూపంలో థామస్ జీవితంలోని ముఖ్య ఘట్టాలను పెట్టారు.
టవర్ లాగా నిర్మించిన భాగం తప్ప మిగిలిన నిర్మానమంతా కేరళా శైలిలోనే నిర్మింపబడినది.
పెంకులతో నిర్మించిన మండపంలో సెయింట్ థామస్ శిలువను ప్రతిష్టించారని చెబుతారు. దానికి గుర్తుగా అక్కడ ఒక బౌద్ధ స్థూపం లాంటి నిర్మాణం పైన శిలువను ఉంచారు.
సందర్శకులు ఇక్కడ ప్రార్ధనలు చేసుకోవడం, బైబిల్ చదువుకోవడం చేస్తుంటారు.
ప్రధాన ప్రార్ధనా స్థలికి వెళ్ళే దారిలో టేకు చెక్కమీద బైబిల్ లో ఉదహరించిన ఘట్టాలను సుందరంగా చెక్కిన జూబ్లి డోర్ దర్శనమిస్తుంది.
డోమ్ లాగా నిర్మించిన పైకప్పు మీద వివిధ వర్ణ చిత్రాలను అందంగా చిత్రించారు.
లోపలి భాగంలో నలుపక్కల యేసు క్రీస్తు, మేరిమాత, సెయింట్ థామస్ మరియు ఇతర సెయింట్స్ మూర్తులను చక్కగా అమర్చారు.
శుభ కార్యాలప్పుడు, పర్వదినాలలో ప్రార్ధనలు చేస్తారిక్కడ.
పడమర వైపున పురాతన ఆలయ శిధిలాలు, చర్చి అధ్వర్యంలో నడుపుతున్న స్కూల్, చర్చి అభివృద్ధికి తోడ్పడిన ప్రముఖుల సమాధులను సందర్సించుకొని, మొదటి భాగమైన మ్యూజియం వైపుకు వచ్చాము.
ఇక్కడ ఎన్నో చారిత్త్రాత్మిక వస్తువులు, సెయింట్ థామస్ వాడిన వస్తువులు ఉన్నాయని తెలిసింది.
చూద్దమనుకోన్నాము.
కాని టైం అయిపోవడంతో మూసేసారు.
బాధనిపించింది.
ఫోటోలు తీసుకొని బయటికి వచ్చి కారు ఎక్కుతూ ఎన్నో చారిత్రిక అంశాలకు చిరునామా అయిన పలయూర్ చర్చి వంక తృప్తిగా చూస్తూ ఉండగానే శయన్ వాహనాన్ని ముందుకు నడిపాడు.
7, నవంబర్ 2012, బుధవారం
Importence of Radha sapthami [ Radhasapthami pooja Mahima ]
రధ సప్తమి పూజ మహిమ
అనేకానేక హిందూ పురాణాలూ , గ్రంధాలలో పేర్కొన్న ఎందరో దేవి దేవతలలో లోకాలకు వెలుగును ప్రసాదించే శ్రీ సూర్య నారాయణ స్వామిని ప్రత్యక్ష దైవంగా అభివర్నించాయీ అంటే కారణం ఆయనొక్కడే ప్రతినిత్యం దర్శనమిచ్చేది కనుక.
.యాంగ్ ,అమతేరాసు , సురియ , ఇరుదేవియ, రా, హిలియోస్ మరియు అపోలో గా ఒక్కో దేశంలో దివాకరుడు ఒక్కో పేరుతొ పిలవబడుతున్నాడు.
వేదకాలం నుండి పలు విధాలుగా ఆదిత్యుని సేవించుకోవడం హిందూ మతంలో ఒక సాంప్రదాయంగాను, ఒక ఆచారంగా స్థిరపడిపోయింది.
నిత్యం సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడం మరియు సూర్య నమస్కారములు వాటిల్లో కొన్ని.
కాని మారిన యుగాధర్మానుసారం కలియుగంలో విగ్రహారాధన, మానవులకు తప్పనిసరి అయిన క్రమంలో కొన్ని పూజలు పెద్దలు నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.
అలా నిర్ణయించిన వాటిల్లో రధ సప్తమి పూజ ఒకటి.
అదితి, కశ్యప మహర్షి దంపతులకు జన్మించిన ఆదిత్యుడు లోకాలకు వెలుగు మరియు కాలనిర్ణయం చేసే క్రమంలో పన్నెండు రాశులలో ఒక్కో దానిలో నెల రోజుల చొప్పున ఉంటూ ఆరు నెలలకొకసారి తన గతిని మార్చుకుంటారు. దానినే దక్షిణాయనం , ఉత్తరాయణం అంటారు.
మకర సంక్రాంతి నుండి [ 15 జనవరి ] జులై పదిహేను వరకు దక్షిణాయనం , జూలై నుండి తిరిగి సంక్రాంతి వరకు ఉత్తరాయణం.
అలా దివాకరుడు దిశ మారిన తరువాత వచ్చే మాఘ మాస శుక్ల పక్ష సప్తమినే రధ సప్తమి అని లేదా సూర్య జయంతి అని అంటారు.
తరతరాలనుండి రధ సప్తమి జరుపుకోవడం హిందూ సాంప్రదాయం గా వస్తోంది.
ఆ రోజున జరుపుకొనే సూర్య పూజకు విశేష విశిష్స్టత ఉన్నది.
పురాణగాధ :
రధ సప్తమి నాడు నిర్వర్తించే పూజకు సంభందించి ఒక పురాణ గాధ ప్రచారంలో ఉన్నది.పూర్వం కాంభోజ దేశాన్ని పాలించే యశో వర్మమహారాజుకు సంతానం లేకపోవడంతో ఘోర తపము చేయగా సంతుస్టుడైన సదాశివుడు రాజుకి పుత్రా సంతానాన్ని ప్రసాదించారు.
కాని జన్మించినది మొదలు ఆ బిడ్డ సదా అనారోగ్యం ఉండేవాడు.
సంతానం కలిగినా బిడ్డ అనారోగ్యం వలన ఆ ఆనందాన్ని పొందలేక రాజదంపతులు చింతించే వారు .
తన పర్యటనలో భాగంగా కాంభోజ దేశానికొచ్చిన వినీత మహర్షిని సేవించిన యశో వర్మ దంపతులు తమ ఒక్కగానొక్క వంశాంకురం ఆరోగ్య పరిస్థితిని గురించి తెలిపి తరునోపాయాన్ని తెలుపమని ప్రార్ధించారు.
ముని తన దివ్యదృష్టితో చూసి రాజదంపతులకు వారి కుమారుడు గత జన్మలో చేసిన పాపాలకు ఫలితాన్ని ఈ జన్మలో ఇలా అనుభవిస్తున్నాడని దీనికి సరియన పరిస్క్హారం సుర్యారాధనతోనే లభిస్తుందనీ,ఆదిత్యుని ఆరాధన సమస్త పాపాలను నిర్మూలించడమే కాకుండా ఆరోగ్యాన్ని ప్రసాద్తిస్తుందని, ఆ పూజ విధాన్నాన్ని తెలిపారు.
మహర్షి చెప్పిన విధంగా రధ సప్తమి నాడు ప్రత్యక్ష నారాయణుని పూజ చేయడంతో వారి కుమారుడు సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాడు.
రధ సప్తమి పూజా విధానం :
సూర్య జయంతి నాడు వేకువనే అంటే తొలి కిరణాలు భూమిని తాకక ముందే నిద్ర లేచి, కాలకృత్యాలు తీర్చుకొని పారుతున్న నీటిలో అనగా నది లేదా కాలువలోతలమీద ఒకటి, భుజాల మీద, మోకాళ్లమీద , పాదాల మీద రెండేసి చొప్పున మొత్తం ఏడు జిల్లెడు ఆకుల నుంచుకొని స్నానమాచరించి, గాయత్రీ మంత్రాన్ని పఠిస్తూ సూర్యునికి అర్ఘ్యమివ్వాలి.అనంతరం గృహములో తూర్పుదిశగా రధము ముగ్గు వేసి అందులో భాస్కరుని మూర్తిని గాని, పటాన్నిగాని పెట్టి ,పెద్దలకు మ్రొక్కి, కుల దైవాన్ని ఆరాధించి, శాస్త్రోక్తంగా సూర్య నారాయణుని ఎఱ్ఱని పూలతో పూజించాలి.
నైవేద్యముగా పొంగలిని సమర్పించాలి.
ఆ రోజంతా ఉపవాసముండి, నిర్మల మనస్సుతో ఆదిత్య హృదయాన్ని పటించాలి.
సాయం సంధ్యా సమయంలో తిరిగి స్నానమాచరించి, పూజా స్థలిలో దీపారాధనచేసి, ఆలయ దర్శనము చేసి, పొంగలిని స్వీకరించి ఉపవాస విరమణ చేయాలి.
దీనివలన ఆరోగ్యము, దీర్ఘాయుషు మరియు ఐశ్వర్య ప్రాప్తి లభిస్తాయి.
సూర్యారాదనలో ఇమిడివున్న ఆరోగ్య సూత్రాలు :
హిందూ మతంలో పూజా విదానాలన్నింటిలో అంతర్గతంగా ఆరోగ్య సూత్రాలు పొందుపరచబడి ఉంటాయి.
సుర్యారాదనలో కూడా ఎన్నో ఆరోగ్యాభివృద్ధిని కలిగించే మర్మాలు దాగిఉన్నాయి.
వేకువనే నిద్ర లేవడం వలన రోజంతా ఉత్సాహంగా ఉండచ్చును.పారే నీటిలో స్నానమాచరించడం వలన మలినాలు తొలగిపోయి శరీరం శుభ్ర పడుతుంది.
సూర్య నమస్కారలవలన , శరీరాన్ని తాకే నులివెచ్చని అరుణ కాంతితో చర్మము కాంతివంతంగా మారుతుంది. ఎముకలు బలపడి శారీరక ధృడత్వం కలుగుతుంది.
ఉపవాస మూలంగా శరీరంతర్భాగాలకు తగిన విశ్రాంతి లభిస్తుంది. తద్వారా జీర్ణశక్తి పెరిగి, శరీరానికి కావలసిన పోషకాలు లభించడం వలన చురుకుగా ఉండవచ్చును.
ఆదిత్య హృదయం ఫటించుట వలన మానసిక స్థిరత్వం కలిగి, ముఖ్య విషయాలలో సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు. అన్నింటా విజయం లభిస్తుంది.
పూజ వలన ఏకాగ్రత, శ్రద్ధా భక్తులు నెలకొంటాయి.
ఆలయ దర్శనం వలన మానసిక ఆనందం, ఆధ్యాత్మిక అవగాహన చేకూరుతుంది.
ఇలా దైనందిన జీవితాన్ని సుఖమయం చేసుకొనే అనేక ఆవశ్యక సూత్రాలను పూజ విధానాల ద్వారా భావి తరాలకు అందించిన మన పూర్వీకులు చిరస్మరనీయులు.
ఏ తరానికైనా, కాలానికైనా సరిపడే విధంగా వారు రూపొందించి అందించిన విధివిధానాలను పాటించి మన జీవితాలలో సుఖశాంతులను నెలకొల్పె, మనవైన ఆచారాలను గౌరవించడం మనం వారికిచ్చే నిజమైన నివాళి.
5, నవంబర్ 2012, సోమవారం
Rare Temples of Andhra pradesh.
అరుదైన ఆలయాల ఆంధ్ర ప్రదేశ్
వేద సారం నింపుకొన్న వేదభూమి మన భరత భూమి.
దైవం మానవ రూపంలో నడయాడిన దివ్య భూమి.
మానవులకు మార్గదర్శకత్వం చేసే దైవ లీలలను తెలిపే పురాణాలు పుట్టిన పవిత్ర భూమి.
ఇవన్ని సామాన్యునికి కూడా అర్ధమైయ్యేల నిర్మించిన మహోన్నత దివ్య ధామాలెన్నో నెలకొన్న పుణ్య భూమిది.
ఉత్తరాన హిమాలయాల నుండి దక్షిణాన కన్యాకుమారి వరకు మంచు కొండల్లో, సాగర తీరాలలో, దట్టమైన అరణ్యాలలో, ఎత్తైన పర్వతాల మీద ఇలా ఎక్కడైతే వేద రూపుడైన దైవం తాలూకు పాద ముద్ర పడినదని పురాణాలు పెర్కొన్న ప్రతిచోటా ఆ విషయాన్ని నమ్మిన అనేక రాజవంశాలకు చెందిన పాలకులు పవిత్ర ఆలయాలను నిర్మించారు.
పవిత్రతే కాకుండా ప్రజలకు ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను, పర్యావరణావశ్యకతను తెలియచేపుతాయీ ఆలయాలు.
రాతిని అద్భుతంగా మలచి రమణీయ శిల్పాలుగా రూపొందించి ప్రాచీన భారతీయ శిల్పకళకు ప్రత్యక్ష రూపాలుగా
పేరొంది, వందల సంవత్సరాల తరువాత కూడా చెక్కుచెదరకుండా ఉండి దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా
గుర్తింపబడి పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి.
చాలా రాష్ట్రాలకు పర్యాటకం ద్వారానే ఎంతో ఆదాయం లభిస్తోందన్నది అందరికి తెలిసిన నిజమే.
అలాంటి వాటిల్లో తమిళనాడు అగ్రస్థానంలో ఉండగా ద్వితీయ స్థానంల కేరళదే.
ఈ విషయంలో చాల వెనుక బడిన మన రాష్ట్రానికి అరుదైన ఆలయాలున్నా ఆ ఘనతను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమవ్వడం ఎంతో విచారకరం.
ప్రభుత్వపరంగా తీసుకోవలసిన నిర్ణయాలను వారికే వదిలి అపూర్వ ఆలయాల ఆంధ్రప్రదేశ్ గురించి ఈ రాష్ట్ర ప్రజలుగా తెలుసుకోవడం మన కనీస భాద్యత.
ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం గలదిగా పేరొందిన వాటికన్ సిటీని మించినదిగా నేడు గుర్తింపుపొందిన కలియుగ
దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైన తిరుమల తిరుపతి,
లోకపాలకురాలైన ముగురమ్మల మూలపుటమ్మవిజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గమ్మ, లోకకంటకులను హతమార్చిన అరుదయిన రూపుడైన శ్రీ నారసింహ స్వామి, నవ నారసింహ రూపాలలో స్థిరనివాసమైన
అహోభిలం, శ్రీ వరాహ నారసింహస్వామి ఆవాసమైన సింహాచలం, చదువుల తల్లి శ్రీ సరస్వతి దేవి క్షేత్రం బాసర,
ద్వాదశ జ్యోతిర్ లింగ, అష్టాదశ పీఠాలలో ఒకటి అయిన శ్రీశైలం, పంచారామ క్షేత్రాలైన అమరావతి, పాలకొల్లు,
భీమవరం, సామర్లకోట, ద్రాక్షారామం అందరికి తెలిసిన వాటిల్లో కొన్ని.
అయితే చాలా మందికి తెలియని ముఖ్యమైన, అరుదయిన,దేశంలోని మరే రాష్ట్రంలో లేని విషయమేమిటంటే జగద్రక్షకుడైన శ్రీహరి లోకసంరక్షనార్ధం ధరించిన దశావతారల ఆలయాలు మన రాష్ట్రంలోనే ఉండటం.
ఈ గొప్పదనంలో కొంత భాగం అరుదైన ఆలయాల రాష్ట్రం అయిన కేరళకు ఇవ్వవచ్చు. అక్కడా ఆన్ని అవతారాల ఆలయాలున్నామత్స్య, కూర్మ అవతారాలకు ఉన్నవి ఉపాలయాలే. కాని ఈ పరుశురామ భూమిలో శ్రీ వారి వాహనం అయిన గరుత్మంతునికి, ఎందరో లోకకంటకులను సంహరించిన సుదర్శన చక్రానికి ప్రతేక ఆలయలుండడం చెప్పుకోవాల్సిన అంశం.
కలియుగాంతంలో రాబోయే కల్కి అవతారం సహా మిగిలిన మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన { త్రివిక్రమ }, పరశురామ, శ్రీ రామ, శ్రీ కృష్ణ, శ్రీబలరామ అవతారాల ఆలయాలు మన రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో ఉన్నాయి.
ఇవన్నీ ఎంతో పౌరాణిక ప్రాశస్త్యం తో పాటు వందల సంవత్సరాల చారిత్రక నేపద్యం కలిగినవి కావడం చెప్పుకోవలసిన విషయం.
ప్రస్తావించవలసిన మరో అంశం ఏమిటంటే శ్రీ మహావిష్ణువు అవతారంగా కొన్ని వర్గాలు పేర్కొనే గౌతమ బుద్దుని గురించి ,ఆయన స్థాపించిన బౌద్ధం తాలుకు ప్రభావము తెలిపే నిర్మాణాలు, జ్ఞాపికలు రాష్ట్రం నలుమూలలా ఉండటం.
భాగవత పురాణంలో ఉటంకించిన విష్ణు అవతారాలలో బుద్ధావతారం ఒకటి.
అదే పురాణంలో పేర్కొన్న మరో అవతారమైన మోహిని ఆలయం కూడా మన రాష్ట్రం లోని తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంకి సమీపంలోని ర్యాలిలోఉన్నది.
సాలగ్రామ శిల మీద చెక్కిన అయిదు అడుగుల శ్రీ జగన్మోహిని కేశవ స్వామి విగ్రహం అత్యంత సూక్ష్మ సుందర చెక్కదాలతో నయన మనోహరంగా దర్శనమిస్తుంది.
క్రీస్తు శకం పదకొండో శతాబ్దంలో విక్రమ దేవ చోళ రాజు నిర్మించిన ఆలయమిది.
లోక సంరక్షణార్ధం శ్రీ మన్నారాయణుడు ధరించిన తొట్ట తొలి అవతారం మత్స్యం.
మత్స్యావతార ఆలయం :
పరమ పావన క్షేత్రం తిరుమల తిరుపతికి డెబ్భయి కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగలాపురంలో జగద్రక్షకుడు మత్స్య రూపం లో ఎన్నో శతాబ్దాలనుండి పూజలందుకొంటున్నారు.
సోమకాసురుడనే దానవుడు సృష్టికర్త బ్రహ్మదేవుని వద్ద నుండి వేదాలను అపహరించుకోనిపోవడంతో సృష్టి ఆగిపాయిందట.
విధాత, విష్ణుమూర్తిని ప్రార్ధించగా ఆయన మత్స్యరూపం దాల్చి సాగర గర్భాన దాగివున్న అసురుని సంహరించి వేదాలను తిరిగి విరించికి అప్పగించారు.
ఈ ఆలయాన్ని, గ్రామాన్ని విజయనగర సామ్రాజ్యాదీశుడైన శ్రీ కృష్ణ దేవరాయలు తన తల్లి అయిన నాగులా దేవి
ఈ ఆలయాన్ని, గ్రామాన్ని విజయనగర సామ్రాజ్యాదీశుడైన శ్రీ కృష్ణ దేవరాయలు తన తల్లి అయిన నాగులా దేవి
పేరుమీద నిర్మించారు.
సుందర మోము. చతుర్భుజాలు, వక్షస్థలం మీద కౌస్తుభం, నడుము క్రింది భాగం చేపాకారంలో కన్నుల పండుగ
చేసే రమణీయ పుష్పాలంకరణతో గర్భాలయంలోశ్రీదేవి,భూదేవి సమేత శ్రీ వేదనారాయణ స్వామి కొలువు తీరి వుంటారు.
చేసే రమణీయ పుష్పాలంకరణతో గర్భాలయంలోశ్రీదేవి,భూదేవి సమేత శ్రీ వేదనారాయణ స్వామి కొలువు తీరి వుంటారు.
అనేక ఉపాలయాలున్నఈ ప్రాంగణంలో ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో [మార్చి] మూడు రోజులు
పడమర దిశగాఉండే గర్భాలయంలోని మూలవిరాట్టు మీద సాయం సంధ్యా సమయంలో సూర్య కిరణాలు మొదటి
రోజున పాదాలమీద రెండో రోజు నడుము భాగాన్ని, మూడవ రోజు మోముని తాకుతాయి.
పడమర దిశగాఉండే గర్భాలయంలోని మూలవిరాట్టు మీద సాయం సంధ్యా సమయంలో సూర్య కిరణాలు మొదటి
రోజున పాదాలమీద రెండో రోజు నడుము భాగాన్ని, మూడవ రోజు మోముని తాకుతాయి.
ఈ మూడురోజులను సూర్య పూజగా నిర్ణయించి వైభవంగా జరుపుతారు.
కూర్మావతార ఆలయం :
దూర్యాస ముని శాపంతో బల సంపదలను కోల్పోయిన దేవతలు వాటిని తిరిగి సాధించుకోడానికి శ్రీ మహావిష్ణు సలహా మేరకు తప్పనిసరి పరిస్థితులలో తమ దాయాదులైన దానవులతో కలసి అమృతం కొరకు క్షీరసాగరాన్ని
మధించడానికి మంధర పర్వతాన్ని కవ్వంగా, సర్పరాజు వాసుకిని తాడుగా చేసుకొని ప్రయత్నించగా, పర్వతం పదేపదే నీటిలో మునిగిపోతుండటంతో తిరిగి శ్రీహరిని ప్రార్ధించగా ఆయన తాబేలు రూపం ధరించి పర్వతాన్ని మునిగిపోకుందాచేసి, దేవ దానవ మధనంలో అమృతంతో పాటు శ్రీ మహాలక్ష్మి, ధన్వంతరి, కామధేనువు లాంటి దేవతలకు తద్వారా లోకాలకు మేలుచేసే పదునాలుగు పవిత్ర ఉద్భవాలు వెలికి వచ్చాయి.లోకాలకు మేలుచేసిన కుర్మావతరానికి శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీకూర్మం లో ఉన్నది.
లభించిన పౌరాణిక, చారిత్రక ఆధారల ప్రకారం తోలి ఆలయం క్రీస్తు శకం రెండో శతాబ్దం నాటిదని తరువాత
ప్రముఖ వైష్ణవాచార్యులు శ్రీ శ్రీ శ్రీ రామానుజులవారు పునరుద్దరించారని తెలుస్తోంది. ఈ ఆలయం గురించీ విష్ణు, పద్మ,బ్రహ్మాండ మరియు కూర్మ పురాణాలలో ప్రస్తావించబడినది అంటే ఎంతటి పురాతన క్షేత్రమో !
పదమూడో శతాబ్దానికి చెందిన ప్రస్తుత నిర్మాణం అద్భుత శిల్పకళకు, కుడ్య చిత్రాలకు నిలయం.
గర్భాలయంలో తాబేటి రూపంలోని అర్చ్చామూర్తి పడమర దిశగా కొలువై వుంటారు.
ఆ కారణంగా తూర్పు పడమరలలో రెండు ప్రక్కలా రెండు ద్వ్జజస్తంభాలుంటాయి. ఇది ఛాలా అరుదయిన నిర్మాణ విన్యాసము.
అలానే విష్ణు ఆలయాలలో అరుదయిన నిత్యాభిషేకాలు ఇక్కడ జరుగుతాయి.
వరాహవతార ఆలయం :
బ్రహ మానస పుత్రులైన సనక సనందనాదులను అవమానించినందుకు వారి శాపానికి గురైన వైకుంఠ ద్వారపాలకులైన జయవిజయులు స్వామి వారి అనుగ్రహంతో, మూడు జన్మలు ఆయన వైరులుగా ఉండి తిరిగి
వైకుంఠ నికి చేరుకొనేలా వరం పొంది ఎత్తిన తొలి జన్మ హిరణ్యాక్ష హిరణ్యకశపులు.
వర గర్వంతో హిరణ్యాక్షుడు భూమిని చాపలా చుట్టి పాతాళం లోనికి పోయి దాక్కున్నాడు.
దేవతలు, మునులు ప్రార్ధించడంతో భూదేవి విభుడు వరాహ రూపం దాల్చి పాతాళానికి వెళ్లి దానవుని దురిమి ధరిత్రిని తన కోరల మీద నిలుపుకొని నిరంతరం సంరక్షించే భాద్యతను స్వీకరించారు.
అలా పుడమిని కాపాడి మరొ కల్పానికి నాంది పలికిన వరాహ మూర్తికి మన రాష్ట్రంలో ఆలయము కలియుగ వైకుంఠము తిరుమలలో ఉన్నది.కలియుగ వరదుడు శేషాచలం పర్వతాలను తన నివాసంగా చేసుకోడానికి వరాహ స్వామి అనుమతి తీసుకొని ,ప్రతిగా భక్తులు ఆయనను దర్శించిన తరువాతనే తన దర్శనానికి రావాలన్న నియమాన్ని పెట్టారని తిరుమల క్షేత్ర
అలా పుడమిని కాపాడి మరొ కల్పానికి నాంది పలికిన వరాహ మూర్తికి మన రాష్ట్రంలో ఆలయము కలియుగ వైకుంఠము తిరుమలలో ఉన్నది.కలియుగ వరదుడు శేషాచలం పర్వతాలను తన నివాసంగా చేసుకోడానికి వరాహ స్వామి అనుమతి తీసుకొని ,ప్రతిగా భక్తులు ఆయనను దర్శించిన తరువాతనే తన దర్శనానికి రావాలన్న నియమాన్ని పెట్టారని తిరుమల క్షేత్ర
గాధ ద్వారా తెలుస్తోంది.తెలంగాణా రాష్ట్రం కరీంనగర్ పట్టణంలో ఒక శ్రీ యజ్ఞ వరాహ స్వామి ఆలయం ఉన్నట్లుగా తెలుస్తోంది.
నారసింహవతార ఆలయం :
హిరణ్యకశపుడు సోదరుడైన హిరణ్యాక్షుని సంహరించిన శ్రీ హరి మీద వల్లమాలిన ద్వేషం పెంచుకొని తన రాజ్యంలో హరి నామస్మరణ వినబడకూడదని మునులను, భక్తులను, హింసించేవాడు.చిత్రంగా అతనికి హరినామం తప్ప వేరు లేదు అన్న తలంపు కలిగిన ప్రహ్లాదుడు కుమారునిగా జన్మించాడు.సొంత బిడ్డ, పసివాడు అన్నకనీస కనికరం లేకుండా చిత్ర హింసలకు గురిచేశాడు.అయినా అతనిలో మార్పు రాలేదు సరికదా తండ్రికే హరినామామ్రుత గాన మాధుర్యాన్ని, హరి అంతర్యామి తత్వాన్ని గురించి తెలియచెప్పే ప్రయత్నం చేయగా అంత్యకాలం సమీపించిన అసురుడు వినిపించుకోకుండా చేరువలో ఉన్న స్తంభంలో ఉన్నాడా నీ హరి అని ప్రశ్నించి, ఉంటాడు అన్న సమాధానం విని ఉగ్రుడై గదతో మోదగా దాని నుండి అతనికి ఉన్న వరం మూలాన అటు మనిషి ఇటు మృగం కాని నారసింహ రూపంలో వెలుపలకొచ్చిన విష్ణు మూర్తి లోకభీకరరీతిన హిరణ్యకశపుని వధించగా ముల్లోకవాసులు ఆనందంతో అహోభల, ఆహోభల అని హర్శాతిశయం వ్యక్తం చేశారు. ఆ విధంగా లోకకంటకుని సంహరించిన పావన క్షేత్రం మన రాష్ట్రంలోని కర్నూల్ జిల్లాలోని ఆహోభిలం.
శ్రీ వైష్ణవ నూట ఎనిమిది దివ్య దేశాలలో ఒకటిగా పేరొందిన ఆహోభిలంలో నవ నారసింహులే కాక శ్రీ వేంకటేశ్వరుడు ప్రతిష్టించిన శ్రీ లక్ష్మి నరసింహ స్వామితో కలిపి మొత్తం పది ఆలయాలు,నారసింహుడు బయటికి వచ్చిన ఉగ్రస్థంభం, ప్రహ్లాద బడి ఉంటాయి చిక్కని నల్లమల అడవిలో.యుగాల నాటి పౌరాణిక గాధకు, కాకతీయ ప్రతాప రుద్రుడు, విజయనగర శ్రీ కృష్ణ దేవ రాయలు ఆదిగాగల చరిత్ర ప్రసిద్ధి చెందిన రాజులు చేపట్టిన నిర్మాణాలతో, కైంకర్యాలతో జన భాహుళ్యంలో విశేష ఆదరణ పొందిన క్షేత్రం అహోబిలం.మనోహరమైన ప్రకృతి, ఆహ్లాద వాతావరణం, అద్వితీయ అధ్యత్మికతల మేలు కలయిక అహోబిలం.
వామనావతార ఆలయం :
శ్రీ మహావిష్ణువు భక్తులలో అగ్రస్థానంలో నిలిచిన ప్రహ్లాదుడు తన అచంచల భక్తితో శ్రీవారు లోకసంరక్షనార్ధం నారసింహ అవతారం ధరించడానికి కారణము కాగా ఆయన మనుమడు బలి చక్రవర్తి శ్రీహరి అయిదోది అయిన వామనావతార ఆవిర్భావానికి కారణభూతుడయ్యాడు.
నీతిమంతుడు, ఆదర్శ పాలకుడు, ధర్మబద్దుడు, దానశీలి, అన్నింటికీ మించి హరి భక్తుడైన బలి చక్రవర్తి ముల్లోకాలను జయించి, తొంభై తొమ్మిది అశ్వమేధ యాగాలు చేసి ఇంద్ర పదవి దక్కించుకోవడానికి అర్హమైన నూరో యాగానికి సన్నద్ధం అవుతున్న తరుణంలో దేవతలందరు వైకుంఠ వాసునికి ఆ విషయాన్ని విన్నవించుకొన్నారు. ఎన్నిసుగుణాలున్నా జన్మతః అసురుడైనందున ఇంద్ర పీఠం అలంకరించడానికి అనర్హుడని నిర్ణయించిన జగద్రక్షకుడు, అతని ప్రయత్నాన్ని ఆపడానికి, అదితి కశ్యప దంపతులకు వామనునిగా జన్మించి, వెళ్లి బలిని మూడడుగుల నేల దానంగా కోరారు. అర్ధించిన వారిని రిక్తహస్తాలతో పంపే అలవాటు లేని దానవ చక్రవర్తి, గురువు శుక్రాచార్యుడు అడ్డుచేప్పినా వినకుండా వామనుడు కోరిన మూడడుగుల నేలను దానంగా ఇచ్చారు.
అలా దానంగా పొందిన బాల వటువు ముల్లోకాలను జయించిన విశ్వరూపునిగా మారి తొలి రెండడుగులతో భూమిని, గగనాన్ని ఆక్రమించి, మూడో అడుగును బలి తలపై మోపి, అతనిని పాతాళానికి పంపారు. త్రివిక్రమ రూపంతో లోకాలను కాపాడిన వామన మూర్తికి అదే రూపంలో కంచిలో ఉలగండ పెరుమాళ్ ఆలయాన్ని పల్లవ రాజులు నిర్మించారు.
అక్కడ సుమారు యాభై అడుగుల మూర్తి నేత్రపర్వంగా దర్శనమిస్తుంది.
అంత పెద్దది కాకపోయినా వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన పురాతన త్రివిక్రమ ఆలయం మన రాష్ట్రంలో కూడా ఉన్నది.
గుంటూరు జిల్లా బాపట్లకు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న చెరుకూరు గ్రామలో ఉన్నది చరిత్ర ప్రసిద్దికెక్కిన ఆలయం. చెరుకూరు ప్రకాశం జిల్లలో భాగం.
ఐదడుగుల ఎత్తు గులాబి రంగు త్రివిక్రమ మూర్తి అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి రంగులో ఉండే విగ్రహాన్నిమరెక్కడా చూడము. .చేరువలోనే ఉన్న మరో పురాతన కట్టడం శ్రీ అగస్తేశ్వర స్వామి ఆలయం. పై భాగాన చుట్టుతో శ్వేత వర్ణ లింగం ఈ ఆలయ ప్రత్యేకత. మరెన్నో ఉపాలయాలు ఇక్కడి రెండు ఆలయాలలో ఉన్నాయి.
పౌరాణికంగానే కాక, చారిత్రకంగా కూడా ఎంతో ప్రాశాష్త్వం ఉన్న క్షేత్రం చెరుకూరు
గతం తాలూకు విషయాలను తెలిపే ఎన్నో శాసనలిక్కడ ఉన్నాయి.. పురావస్తు శాఖ నిర్వహించిన త్రవ్వకాలలో ఎన్నో దేవతా విగ్రహాలు లభ్యమయ్యాయి. వాటిని శ్రీ అగస్తేశ్వర స్వామి ఆలయంలో వీక్షించవచ్చును.
ఈ పురాతన ఆలయానికి లభించాల్సిన గుర్తింపు లభించకపోవడం శోచనీయం.
పరశురామ అవతార ఆలయం :
పన్నుకు పన్ను, కన్నుకు కన్ను, ప్రాణానికి ప్రాణం అన్న ఆ నాటి న్యాయ సూత్రాలకనుగుణంగా వ్యహరించినా దానిలో అవతార పరమార్ధమైన లోకకంటకుల అణిచివేత, అన్యాయాన్ని అరికట్టడం లాంటివి మేళవించి పాపభారం నుండి భూదేవిని రక్షించి, లోకానికి మేలు చేసినదే పరశురామ అవతారం.
రేణుక, జమదఘ్ని దంపతులకు రాముడన్న నామధేయంతో జన్మించారు అవతారమూర్తి.
పిత్రు వాక్యపాలన కోసం తల్లిని, సోదరులను సంహరించి, తన ఆదేశాన్ని పాటించినందుకు సంతసించి జమదగ్ని మహర్షి ప్రసాదించిన వరంతో చనిపోయిన వారిని బ్రతికించమని కోరి తన లోని రెండు పార్శ్యాలయిన , తప్పుచేసినవారికి దండన, ఆ తప్పు ఇతరులకు అపాయం చేసేది కాకపోతే క్షమాపణ అన్నవి తేటతెల్లం చేసి తన అవతార పరమార్థాన్ని లోకానికి తెలిపారు.
చక్రవర్తినన్న గర్వంతో చేసిన అతిధి మర్యాదలను మరిచి, జమదఘ్ని మహర్షిని దారుణంగా హతమార్చి
కామదేనువును అపహరించుకొని పోయిన కార్తవీర్యార్జనుని, అతని కుమారులను తన పరుశువుతో కడతీర్చి, దానితో ఆగ్రహం చల్లారక ఇరవై ఒక్కసార్లు భూమండలం అంతా తిరిగి రాజు అన్న ప్రతివారిని అంతంచేసి
పరశురాముడు అన్న పేరు తెచ్చుకొని, ఆయా రాజ్యాలకు అర్హులైన వారిని పాలకులుగా నియమించి తాను మంధర
పర్వతం మీద తపస్సు చేసుకొంటు సప్త చిరంజీవులలో ఒకరుగా నిలిచారని పురాణాలు తెలుపుతున్నాయి.ఈ కారణంగానో లేక రాజాదరణ లేకనో (?), ఈ అవతారానికి పరశురామ సృష్టిగా పేర్కొనే కొంకణ్ ప్రాంతంతో సహా దేశం మొత్తంమీద రెండు ఆలయలున్నట్లుగా తెలుస్తోంది. మొదటిది కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురం తిరువళ్ళ లోఉన్నది.
కామదేనువును అపహరించుకొని పోయిన కార్తవీర్యార్జనుని, అతని కుమారులను తన పరుశువుతో కడతీర్చి, దానితో ఆగ్రహం చల్లారక ఇరవై ఒక్కసార్లు భూమండలం అంతా తిరిగి రాజు అన్న ప్రతివారిని అంతంచేసి
పరశురాముడు అన్న పేరు తెచ్చుకొని, ఆయా రాజ్యాలకు అర్హులైన వారిని పాలకులుగా నియమించి తాను మంధర
పర్వతం మీద తపస్సు చేసుకొంటు సప్త చిరంజీవులలో ఒకరుగా నిలిచారని పురాణాలు తెలుపుతున్నాయి.ఈ కారణంగానో లేక రాజాదరణ లేకనో (?), ఈ అవతారానికి పరశురామ సృష్టిగా పేర్కొనే కొంకణ్ ప్రాంతంతో సహా దేశం మొత్తంమీద రెండు ఆలయలున్నట్లుగా తెలుస్తోంది. మొదటిది కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురం తిరువళ్ళ లోఉన్నది.
ఈ ఆలయంతో సమానమైన పౌరాణిక, చారిత్రక ప్రాసశ్త్యం ఉన్న పరశురామ ఆలయం మన రాష్ట్రం కడప జిల్లా రాజంపేటకు పది కిలమీటర్ల దూరంలోని అత్తిరాలలో ఉన్నది.
ఈ క్షేత్రం గురించి ఎన్నో కధనాలు జనసామన్యంలో ప్రస్తావించబడుతున్నాయి.
త్రేతాయుగంలో ఎంతో రక్తపాతం సృష్టించిడంవలన సంక్రమించిన పాపాన్ని ఇక్కడి బహుదా నదిలో స్నానమాచరించి తొలగించుకున్నారు అవతార స్వరూపుడు.
అదే కాలంలో శంఖుడు అనే ముని సోదరుడు అయిన లిఖితుడు, క్షుద్భాదతో అనుమతి లేకుండా పరుల తోటలో పండ్లను కోసినందుకు శిక్షగా అతని చేతులు ఖండించబడినాయి.
అన్న సలహా మేరకు తీర్ధయాత్రలు చేస్తూ ఇక్కడికి వచ్చి నదిలో స్నానమాడగా అతని చేతులు తిరిగి వచ్చాయట.
ఆ కారణంగా నదికి బహుద / చెయ్యేరు అన్న పేరు వచ్చినట్లుగా తెలుస్తోంది.
అత్తిరాలలో క్రీస్తు పూర్వం మూడో శతాబ్దం నుండి పరశురామ ఆలయం ఉన్నట్లుగా తెలుస్తోంది.
తొలుత బౌద్దుల ఆధీనంలో, తదనంతరం వైష్ణవుల నిర్వహణలోనికి వచ్చినది.
కొంతకాలం శైవుల ప్రాబల్యం కూడా ఈ క్షేత్రం మీద ఉన్నది అన్న దానికి ఇక్కడి శ్రీ త్రేతేశ్వర స్వామి ఆలయం సాక్ష్యంగా దర్సనమిస్తుంది.
ఆలయంలోని శిల్ప కళ , డెభై రెండు స్తంభాల మండపం గొప్పగా ఉంటాయి.
ఆలయ నిర్మాణ విశేషాలను వెలుగు లోనికి తేవడానికి తగిన పరిశోధనలు జరపవలసిన అవసరం ఎంతైనా ఉన్నది.
శ్రీ రామావతార ఆలయం
భారత దేశంలో జన్మించిన ప్రతి ఒక్కరికి మహా కావ్యమైన రామాయణం గురించి తెలియకుండా ఉండదు.
ఆదర్శ మానవునికి ప్రతిరూపం శ్రీ రామ చంద్రుడు.
మానవ ధర్మాలను ఆచరించి సమస్త మానవాళికి ఆదర్శంగా నిలిచి లోక పూజ్యుడైనారు లోకాభి రాముడు.
శ్రీ మన్నారాయనుని సప్తమ అవతారంగా, ఇక్ష్వాకు కుల తిలకంగా ఇలలో నడయాడిన అయోధ్యా పతి దివ్య గాధ రామాయణం లోని ముఖ్య ఘట్టాలతో ముదిపదిఉన్న క్షేత్రాలు ఈ దేశంలో ఎన్నో ఉన్నాయి.
అవన్నీ భక్తులకు దర్శనీయ స్థలాలు.
ఈ కలియుగంలో కూడా కొలిచిన వారిని కాపాడే కోదండ రాముడు కోరి కొలువు తీరిన క్షేత్రలెన్నో ఈ పవిత్ర భూమిలో నెలకొని ఉన్నాయి.
అలాంటి వాటిల్లో మన రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో పవిత్ర గోదావరి తీరంలోని భద్రాచలం ఒకటి.
పర్వత రాజు భద్రుని కోరిక మేరకు కొలువై, పోకల దమక్క ద్వారా తిరిగి మరో మారు లోకానికి ప్రకటిత మైన పట్టాభి రామునికి, గోల్కొండ నవాబు తానీషా కొలువులో పనిచేసే కంచర్ల గోపన్న( రామదాసు ) ఆలయం కట్టించడం ఇవన్ని మనందరకీ తెలిసిన విషయాలే.
ప్రతి నిత్యం వేలాది భక్తులు సందర్సించుకొని, సేవించుకొనే సీతా మనోభిరాముడు కొలువైన భద్రాద్రి శ్రీ రామ నవమి రోజున జరిగే కళ్యాణానికి లక్షలాది మందిని ఆకర్షిస్తుంది.
ప్రతి నిత్యం వేలాది భక్తులు సందర్సించుకొని, సేవించుకొనే సీతా మనోభిరాముడు కొలువైన భద్రాద్రి శ్రీ రామ నవమి రోజున జరిగే కళ్యాణానికి లక్షలాది మందిని ఆకర్షిస్తుంది.
శ్రీ బలరామావతార ఆలయం :
శ్రీ వైష్ణవం ప్రకారం శ్రీ మహావిష్ణు దశావతారాలలో శ్రీ బలరామావతరం ఎనిమిదోది.
మిగిలిన సంప్రదాయాల ప్రకారం బలరాముడు, ఆదిశేషుని అంశ.
ఈయనకు సంకర్షణ, హలధర అన్న నామాలు కూడా ఉన్నాయి.
దేవకీ, వసుదేవుల సప్తమ గర్భస్థ శిశువును యోగ మాయ, బృందావనంలో ఉన్న వాసుదేవుని మరో భార్య రోహిణి గర్భంలోనికి మార్చినది. శ్రావణమాసంలో పౌర్ణమి రోజున జన్మించారు బలదేవుడు. కాని వైశాఖ మాసంలో వచ్చే అక్షయ త్రితీయ నాడు ప్రముఖ దేవాలయాలైన బృందావనం, మథుర, పూరి మరియు అన్ని ఇస్కాన్ మందిరాలలో బలదేవుని జన్మదినాన్ని జరుపుతారు.
అమిత బలంతో పాటు సుందర రూపం ఆయన సొంతం.
బలరాముని భార్య రేవతి.
ధేనుకాసురుడు, ప్రలంబుడు లాంటి దానవులను సంహరించారు.
గదా యుద్ధంలో ఆయనకు ఆయనే సాటి.
దుర్యోధన, భీమసేనులను గదాయుద్ధంలో శిక్షణ యిచ్చినది బలదేవుడే .
గదాయుద్ధంలో ఆరితేరినా ఆయన ఆయుధం మాత్రం నాగలి.
నాగలి వ్యవసాయదారుల ముఖ్య పని ముట్టు.
మానవునికి కావసినవన్ని భూమి నుండే కదా లభించేది.
అలా బలరాముడు రైతులకే కాదు అందరికి కావలసినవి ప్రసాదించేవారు.
ఆయన జన్మదినం అయిన అక్షయ త్రితియ నాడు మన జన్మ నక్షత్రం ప్రకారం ఒక్క బంగారం కాకుండా ఏమి కొంటే లాభిస్తుందో తెలుసుకొని ఆప్రకారం ఆవే కొనే ఒక ఆచారం కొన్ని రాష్ట్రాలలో ఉన్నది.
శ్రీ బలరామునికి, అఖిలండ కోటి బ్రహండ నాయకి అలిమేలుమంగాదేవి కొలువుతీరిన తిరుచానూరు ఆలయ ప్రాంగణంలో యాదవ రాజులు పన్నెండవ శతాబ్దంలో నిర్మించారు.
బలభద్రుడు తన సోదరుడు శ్రీ కృష్ణునితో కలిసి దర్శనమిస్తారు.
కరీంనగర్ జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మి నారసింహ ఆలయంలో ఉన్న అనేక ఉపాలయాలలో ఒక దానిలో శ్రీ బలరాముడు పూజలందుకొంటున్నారని తెలుస్తోంది.
శ్రీ కృష్ణావతారం :
దేవకీ వసుదేవులకు అష్టమ శిశువుగా జన్మించి, గోకులంలో పెరిగి పసితనం నుండి ఎన్నో మహిమలు చూపి, ఎందరో రాక్షసులను సంహరించి, కంటకుడైన కంసుని వధించారు.
సన్మార్గ వర్తులైన పాండవుల పక్షం వహించి దుర్మార్గులైన కౌరవ నాశనానికి దారితీసిన కురుక్షేత్ర సంగ్రామంలో వారికి విజయం సిద్ధించేలా చేసి, భూలోకంలో సుస్థిర, సమగ్ర , ప్రజాహిత పాలనకు మార్గం సుగమనం చేసారు.
మానవులకు జీవిత సత్యాన్ని తెలిపే భగవద్గీతను అందించారు.
శ్రీ కృష్ణ తత్వం లోని పరమార్ధం లోకకల్యాణమే.స్వామికి ఆయన పుట్టిన మథుర, గోకులం, బృందావనం, ద్వారక, ఉడిపి, గురువాయూరు ఇలా దేశంలో ఎన్నో ఆలయాలున్నాయి.
మన రాష్ట్రంలో కృష్ణా జిల్లా గంపలగూడెం దగ్గరలోని నెమలి గ్రామంలో స్వయంభూ శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం ముఖ్యమైనది.ఇక్కడి స్వామిని సంతాన గోపాల స్వామిగా భక్తులు కొలుస్తారు.
విశాల ప్రాంగణంలో ఉన్న ఈ ఆలయం శిల్పకళ చూడ చక్కగా ఉంటుంది.మరో విశేష, అరుదయిన గోపాలకృష్ణుని ఆలయం గుంటూరు జిల్లా ఫిరంగిపురం దగ్గరలోని చెంఘీజ్ ఖాన్ పేట గ్రామంలో ఉన్నది.
నల్ల రాతి తో చెక్కినచేతిలో వెన్నముద్ద పెట్టుకొని దోగాడే బాల కృష్ణుని విగ్రహం అద్భుతంగా ఉంటుంది.
దేశంలో ఇలాంటి రూపంలో ఉన్న శ్రీ కృష్ణుని విగ్రహాలు ఆరు మాత్రమె ఉన్నాయి అంటారు.
ఈ తొమ్మిది అవతారాల ఆలయాలే కాకుండా స్వామి అనంత శయనునిగా కొలువుతీరిన ఆలయలుకూడా ఎన్నో మన రాష్ట్రంలో ఉన్నాయి.
ఆ దివ్య ధామాలలో పవిత్ర పెన్నానదీతీరంలోని తల్పగిరి శ్రీ రంగనాయక స్వామి ఆలయం ఒకటి.
ఇవి లోకకళ్యానార్ధం లోకరక్షకుడైన శ్రీ మహా విష్ణువు ధరించిన అనేకానేక అవతారాలలో ప్రసిద్దిచెందిన దశావతారాలలో నేటి వరకు భూలోకంలో నడయాడిన నవ అవతారాల ఆలయాలు.
వీటిల్లో కొన్నింటికి మర్మత్తులు, పోషణ కోసం తగిన నిధులు, భాహ్యా ప్రపంచానికి వీటిగురించి తెలియడానికి తగిన ప్రచారం ఎంతో అవసరం.అప్పుడే ఆంధ్ర ప్రదేశ్ లోని అరుదైన ఆలయాలకు గుర్తింపు, పర్యాటక రంగంలో సుస్థిర స్థానం లభిస్తాయి.
ఓం నమో నారాయణాయ నమః !!!!
15, అక్టోబర్ 2012, సోమవారం
12, జూన్ 2012, మంగళవారం
18, జనవరి 2012, బుధవారం
Hampi
పదునాలుగవ శతాబ్దములో భారతీయ సంస్కృతుల సంరక్షణ కోసం శ్రీ విద్యారణ్య స్వామి ఆశిస్సులతో ఆరంభిచబడిన విజయనగర రాజ్యం భారత దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందినది.
భారత దేశ నలుచేరుగుల విస్తరించి ఆఖండ సామ్రాజ్యాన్ని స్తాపించి మనవైన సంస్కృతులను జన బాహుల్యంలోనికి తీసుకు వెళ్ళిన ఘనత వారిదే.
ఎన్నో ఆలయాలను నిర్మించడమే గాక పునరుద్ధరించి ఎన్నోకైంకర్యాలను సమర్పించుకున్నారు.
తమ రాజధాని అయిన హంపి ని శత్రు దుర్భేద్యముగా తయారుచేసుకొన్నారు.
క్రీస్తు శకం 1336 వ సంవత్సరంలో స్తాపించబడి 1678 దాక సాగిన వివిధ వంశ రాజుల పాలనలో ప్రజలు సుఖ శాంతులతో గడిపారు.
సుల్తానుల నిరంతర దాడులతో తన సౌందర్యాన్ని కొంత పోగట్టుకొన్నహంపి నేటికి ఎన్నో అద్భుత నిర్మాణాలతో మనలను చకితులను చేస్తుంది.
విఠల ఆలయం, కమల మహల్ , గజ శాల, మహానవమి గద్దె , హజార రామ ఆలయము, బాడవ లింగం . పురందర మండపము , విరుపాక్ష ఆలయము కోదండ రామ ఆలయము, ఉగ్ర నారసింహ, వీరభద్ర , నల్ల రాతి కోనేరు ఇలా ఎన్నో
మాతంగ పర్వతం
విఠలాలయము
ఏకశిలా రధం
తలారి గట్టు
మహానవమి గద్దె
నల్ల రాతి కోనేరు
గజ శాల
హాజర రామ ఆలయం
శ్రీ విరూపాక్ష ఆలయం
సందర్శకులను ఆనందాచార్యాలలోముంచెత్తుతాయి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
Sri Kaithabeshwara Swamy Temple, Kubatur, Karnataka
మరుగునపడిన మహా క్షేత్రం ఆలయాల పూర్తి సమాచారం మరియు క్షేత్ర ప్రాధాన్యత, గాథల గురించిన సంపూర్ణ సమాచారం కోసం పు...
-
శ్రీ గంగా ఉమా సమేత శ్రీ ఓంకార సిద్దేశ్వర స్వామి దేవాలయము, ఓంకారం ఓంకార స్వరూపుడైన కైలాసనాధుడు కొలువు తీరిన అనేకానేక క్షేత్రాలలో ఓంకారం ...
-
శ్రీ కాశీ నాయన ఆలయం, జ్యోతి జ్యోతి, గిద్దలూరు కి సుమారు ౫౦ కిలోమీటర్ల దూరం లో ఉన్నది. వయా ఓబులాపురం మీ...
-
శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి ఆలయం, నెల్లూరు శతాబ్దాల ఘన చరిత్ర కలిగిన నగరం నెల్లూరు. క్రీస్తు పూర్వం మూడో శతాబ్ద కాలానికే...