Sri Omkara Siddeshwara Swamy Temple, Omkaram
శ్రీ గంగా ఉమా సమేత శ్రీ ఓంకార సిద్దేశ్వర స్వామి దేవాలయము, ఓంకారం ఓంకార స్వరూపుడైన కైలాసనాధుడు కొలువు తీరిన అనేకానేక క్షేత్రాలలో ఓంకారం ఒకటి.యుగాల నాటి పౌరాణిక విశేషాలు , శతాబ్దాల చరిత్రకు, తరతరాల భక్తుల విశ్వాసాలకు చిరునామా ఓంకారం. శ్రీ గంగా ఉమా సమేతముగా శ్రీ ఓంకార సిద్దేశ్వర స్వామి కొలువు తీరిన ఈ క్షేత్రం ఒక ప్రశాంత సుందర అరణ్య ప్రాంతం. ప్రశాంతతకు మారు పేరు. మైమరపించే ప్రకృతి సౌందర్యం ఓంకారం సొంతం. స్వచ్చమైన గాలి, పచ్చని పరిసరాలు, మొక్కిన వారిని దరి చేర్చుకొనే పరమేశ్వరుని సన్నిధితో సందర్శకులను ఆధ్యాత్మిక ఆనందంలో ముంచివేస్తుంది ఓంకారం, "ఆర్తులు అందరికి అన్నం" అన్న అవధూత శ్రీ కాశి నాయన మాటను నిజం చేస్తున్న ఆయన భక్త బృందం ఏర్పాటు చేసిన ఆశ్రమం మరియు అన్న వితరణ కేంద్రం , ఇలా ఎన్నో ప్రత్యేకతల సమాహారం ఓంకారం. పురాణ గాధ : క్షేత్రానికి సంబంధించిన పురాణ గాధ ద్వాదశ జ్యోతిర్లింగాల ఆవిర్భాలతో ముడిపడి ఉన్నది. అందరికీ తెలిసినదే! సృష్టి ఆరంభంలో సృష్టికర్త బ్రహ్మ దేవుడు, స్థితకారుడు శ్రీ మన్నారాయణుడు నేను గొప్పంటే నేను గ...
niceeeeeeeeeeeeeeeeeeeee
రిప్లయితొలగించండి