Sri Kodanda Rama swami Temple, Vontimitta

జాంబవంతుడు ప్రతిష్టించిన జగదభిరాముడు శ్రీరామ రామ రామేతి రమేరామే మనోరమే ! సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే !! శ్రీ సీత లక్ష్మణ హనుమత్ సమేత శ్రీ రామ చంద్ర మూర్తి ఆలయం, కనీసం ఒక రామనామ సంకీర్తనా మందిరం లేని ఊరు భారతదేశంలో కనపడదు. అవతార మూర్తి, సకల గుణధాముడు అయిన శ్రీ రామచంద్రుని పవిత్ర నామాన్ని నిర్మల హృదయంతో, నిశ్చల భక్తితో ఒక్కసారి జపిస్తే వెయ్యి సార్లు జపించిన ఫలితం లభిస్తుంది అన్నది శాస్త్ర వాక్యం. అంతటి మహిమాన్వితుడైన మనోభిరాముని కోవెలలో ఉంచి కొలిస్తే మరెంతటి శుభ ఫలితాలను మనం పొందగలం ? మనందరికీ శ్రీ రాముడు ఒక ఆదర్శప్రాయుడైన తనయుడు, సోదరుడు, భర్త, పాలకుడు, వీరుడు మరియు దుష్టశిక్షకుడు, ధర్మరక్షకుడు. శ్రీరాముని జన్మస్థలమైన అయోధ్య తో సహా ఎన్నో విశేష ఆలయాలు భారత దేశ నలుమూలలా నెలకొని ఉన్నాయి. రాష్ట్ర విభజనకు ముందు తెలుగు వారి అయోధ్య భద్రాచలం. తరువాత ఆనవాయితీగా నిర్వహించే శ్రీ రామ నవమి, స్వామి వారి కళ్యాణానికి తగిన క్షేత్ర అన్వేషణ జరిగింది. ఆ సమయంలో అందరి దృష్టినీ ఆకర్షించిన క్షేత్రం "ఏకశిలా నగరం". "ఒ...