పోస్ట్‌లు

జులై, 2021లోని పోస్ట్‌లను చూపుతోంది

Pandava Theerdham, Thiruvannamalai

చిత్రం
  పాండవ తీర్థం  మహాభారతం ఆది కావ్యంగా పేరొందినది. వ్యాస భగవానుడు ప్రధాన పాత్ర పోషిస్తూ స్వయంగా తెలుపగా విఘ్ననాయకుడు  శ్రీ గణపతి అక్షరీకరించిన  మహా కావ్యంలో అన్ని యుగాలకు మరియు కాలాలకు సంబంధించిన విషయాలు వివరంగా ఉండటం విశేషం. అందుకే పెద్దలు  అంటారు మహా భారతంలో లేనిది లేదు అని. రాజకీయం, కుట్రలు, కుతంత్రాలు, యుద్దాలు, ప్రజల జీవన శైలి, నీతి  నియమాలు, న్యాయ, అన్యాయాలు, ధర్మ, అధర్మాలు,స్త్రీ గౌరవం, ఎంతటి వారినైనా వదలని కర్మ ఫలం ఇలా ఎన్నో పంచమ వేదం లో కనిపిస్తాయి.   ఈ మహా పురాణంలో ప్రధాన పాత్రలు కౌరవులు మరియు పాండవులు. వీరు దండయాత్రల పేరిట, యాత్రల నిమిత్తం మరియు ఇతర కార్యక్రమాల కొరకు భారతదేశ నలుమూలలా తిరుగాడినట్లుగా తెలుస్తోంది.    అందుకే భారత దేశంలోని ప్రతి  రాష్ట్రం లోని ఏదో ఒక చోట వీరితో ముడిపడి ఉన్న ప్రదేశాలు కనిపిస్తాయి. ముఖ్యంగా పాండవులు లక్క దహనం తరువాత,మాయా జూదంలో ఓటమి పాలు అయిన తరువాత  చేసిన పుష్కర కాల అజ్ఞాత వాసంలో అనేక ప్రాంతాలలో నివసించినట్లుగా అనేక స్థానిక కధనాలు తెలుపుతున్నాయి. అక్కడి వారు  వాటికి తగి...