64 Yogini Temple, Hirapur, Bhubaneswar

అరుదైన ఛౌసటి యోగిని ఆలయం "మీకు భువనేశ్వర్లో ఛౌసటి జోగిని మందిరం ఎక్కడున్నదో తెలుసా రాజేష్ బాబు" అనడిగాను మా ఒడిశా కొలీగ్ అయిన రాజేష్ పాల్ ని. ఆశ్చర్యపోయాడు అతను. " సార్ ! భువనేశ్వర్ లో పుట్టి, పెరిగాను నేను. ఎన్నో పురాతన ఆలయాలు ఉన్నాయి. కానీ ఛౌసటి జోగిని మందిరం గురించి ఎప్పుడూ వినలేదు. మీకు ఎలా తెలుసు ?" అన్నాడు. అతనికి పురాతన, ప్రత్యేక ఆలయాల సందర్శన పట్ల నాకు గల ఆసక్తి గురించి తెలుసు. "తొమ్మిదో శతాబ్దానికి చెందిన అరవై నాలుగు యోగినిలు కొలువైన మందిరం భువనేశ్వర్ కి దగ్గరలో హీరాపూర్లో ఉన్నదని తెలిసింది" అని జవాబిచ్చాను. "నేను కన...