పోస్ట్‌లు

ఏప్రిల్, 2017లోని పోస్ట్‌లను చూపుతోంది

Sri Varadaraja Perumal Temple, Kanchipuram

చిత్రం
          శ్రీ వరదరాజ పెరుమాళ్ ఆలయం, కాంచీపురం                             సప్త ముక్తి క్షేత్రాలలో ఒకటి కాంచీపురం. విశేష పౌరాణిక చారిత్రిక నగరం. వేగావతి నదీ తీరాన ఉన్న ఈ నగర గొప్పదనాన్ని గురించి చెప్పాలంటే " పుష్పేషు జాతి పురుషేషు విష్ణు నారీషు రంభ నగరేషు కంచి" అన్న ఆర్యోక్తి ఉదాహరిస్తే  చాలు.  కాంచీపురం లో నెలకొన్న అనేకానేక దేవాలయాలలో ప్రముఖమైనవి  శ్రీ ఏకాంబరేశ్వర స్వామి, శ్రీ కామాక్షీ దేవి, శ్రీ వరద రాజ పెరుమాళ్ కోవెల. గతంలో వెయ్యికి పైగా దేవాలయాలు కంచి లో ఉండేవని చెబుతారు.  శ్రీ వైష్ణవులకు పరమ పవిత్రమైన నూట ఎనిమిది దివ్య దేశాలలో ఒకటి ఈ ఆలయం. అంతే కాదు శ్రీరంగం, తిరుమల, మేల్కేటే ల తరువాత కంచి శ్రీ వరద రాజ పెరుమాళ్ కోవెల వారికి అత్యంత పవిత్ర దర్శనీయ క్షేత్రం. మరో విశేషం ఏమిటంటే ఈ నూట ఎనిమిది దివ్య తిరుపతులలో పదునాలుగు కంచి లోనే ఉండటం. అందులో కొన్ని విష్ణు కంచిలో ఉండగా మరి కొన్ని శివ' కంచి ఉంటాయి. విష్ణు కంచి లో ఉండే శ్రీ వరద రాజ పెరుమాళ్ కోవెల ఎంతో ...