Sri Kailasanadar Temple, Kanchipuram
శ్రీ కైలాస నాథర్ ఆలయం , కాంచీపురం సప్త ముక్తి క్షేత్రాలలో ఒకటిగా పౌరాణిక ప్రసిద్ధి చెంది, మహత్తర చరిత్రకు మరోపేరుగా గుర్తింపబడిన ఊరు కాంచీపురం. ఆలయాల నగరంగా ప్రత్యేక గౌరవాన్ని అందుకొన్న ఈ ఊరిలో రెండు భాగాలు కలవు. విష్ణు మరియు శివ కంచి. శివ కంచిలో ముఖ్య ఆలయం శ్రీ ఏకాంబరేశ్వర స్వామిది. విష్ణు కంచిలో ప్రధాన కోవిల శ్రీ వరద రాజ పెరుమాళ్ ది. చిత్రమైన విషయం ఏమిటంటే విష్ణుకంచిలో శివాలయాలు, విష్ణు కంచిలో శివుని కోవెలలు ఉండటం ! ఒకప్పుడు ఇక్కడ వెయ్యికి పైగా ఆలయాలు ఉండేవని చెబుతారు. చాలా వరకు పల్లవ రాజుల కాలంలో నిర్మించినవే! ( క్రీస్తు శకం 3 నుండి 9వ శతాబ్ద మధ్య కాలం) పురాణ, చారిత్రక, నిర్మాణ విశేషాలతో వేటికవే అపూర్వంగా దర్శనమిస్తాయి. అలాంటి వాటిల్లో శివ కంచిలోని అన్నిటికన్నా పురాతన ఆలయముగా పరిగణించేదే శ్రీ కైలాస నాథర్ ఆలయం గురించిన విశేషాలు తెలుపుతున్నాను. సుమారు ఏడో శతాబ్ద కాలంలో పల్లవ రాజు రాజసింహ (ర...