Tiruttani
శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, తిరుత్తణి తమిళనాడులో ఆదిదంపతుల ముద్దుల తనయుడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అధికం. ప్రతి శివ, శక్తి, గణపతి ఉప దేవతగా మరియు మరెన్నో ఆలయాలలో ప్రధాన అర్చా మూర్తిగా సేవలందుకొంటున్నారు షణ్ముఖుడు. అలాంటి వాటిల్లో ఆరు పాడై వీడు ఆలయాలు ముఖ్యమైనవి. అవి పళని, స్వామిమలై, తిరుప్పరం కుండ్రం, పళముదిర్చోళై, తిరుత్తణి మరియు తిరుచ్చెందూర్. గమనించదగిన అంశం ఏమిటంటే మొదటి అయిదు ఆలయాలు పర్వతాల మీద నెలకొని ఉండగా, ఆఖరిదైన తిరుచ్చెందూర్ మాత్రం సముద్ర తీరాన ఉండటం. ఒకప్పుడు ఇక్కడ కూడా పర్వతం ఉండేదట. సముద్ర అలల తాకిడికి కరిగిపోయింది అని చెబుతారు. ఆలయ అంతర్భాగంలో ఆ కొండా తాలూకు చిన్న భాగాన్ని చూడవచ్చును. సుబ్రహ్మణ్య షష్టి లాంటి విశేష పర్వదినాలలోనే కాకుండా ప్రతి నిత్యం వేలాదిగా భక్తులు ఈ ఆలయాలకు తరలి వస్తుంటారు. ఈ ఆరు ఆలయాలు తమవైన పురాణ, చారిత్రక నేపధ్యం కలిగి ఉంటాయి. ఆరు పాడై వీడు ఆలయాల వరుసలో ఐదవది అయిన తిరుత్తణి ఆలయానికి సంబంధించిన పురాణగాథ తొలి ...