Sri Irukalala Parameswari Temple, Nellore

శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి ఆలయం, నెల్లూరు శతాబ్దాల ఘన చరిత్ర కలిగిన నగరం నెల్లూరు. క్రీస్తు పూర్వం మూడో శతాబ్ద కాలానికే నెల్లూరు అప్పట్లో "విక్రమ సింహపురి" దక్షిణాది లోని ముఖ్య నగరాలకు కూడలిగా ప్రాధాన్యత కలిగిన ప్రాంతంగా ప్రసిద్ది చెందినట్లుగా లభించిన శిలా శాసనాలు తెలియచేస్తున్నాయి. మౌర్య చక్రవర్తి అశోకుని నుండి పల్లవ, చోళ, కాకతీయ, శాతవాహన,పాండ్య, తెలుగు చోడ, విజయనగర ఇలా ఎన్నోరాజ వంశాలు ఈ పట్టణ సర్వతోముఖాభివృద్ది కి కృషిచేసినట్లుగా వివిధ చారిత్రిక పరిశోధనా గ్రందాల ఆధారంగా అవగతమవుతోంది. ఇలా ఎందరో రాజుల పాలనలో ఉన్న ఈ ప్రాంతంలో పురాణ ప్రసిద్దిచెందిన పురాతన ఆలయాలకు కొదవ లేదు. నగరంలో, చుట్టుపక్కల ప్రాంతాలలో ఎన్నో విశేష ఆలయాలు నెలకొని ఉన్నాయి. వీటిల్లో చాలా మటుకు అరుదైనవి కూడా! విక్రమ సింహపురి గ్రామ దేవత శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి ఆలయం వాటిల్లో ఒకటి. స్థానికంగానే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుండి కూడా ప్రతినిత్యం ఎందరో భక్తులు దర్శించుకొనే ఈ అమ్మవారు సుమారు ఎనిమిదో శతాబ్దానికి పూర్వమే కొలువుతీరినట్లుగా క్షేత్ర గాధ తెలుపుత...