Appikonda

అప్పికొండ శ్రీ సోమేశ్వర స్వామి ఆలయం దక్షిణ భారత దేశంలో అత్యధిక శాతం శివాలయాలు అగస్థ్య మహర్షితో ముడిపడి ఉంటాయి. ఆయన తరువాత అంతే స్థాయిలో కపిల మహాముని కూడా ఎన్నో శివ లింగాలను ప్రతిష్టించారు అని ఆయా ప్రదేశాల పురాణ గాధలు విశదీకరిస్తున్నాయి. తిరుపతిలో ఏడుకొండల పాదాల వద్ద ఉన్న "కపిల తీర్థం" ఆయన పేరు మీదగా ఏర్పడినదే! మహర్షి కొంతకాలం ఇక్కడి కొండ గుహలో తపమాచారించారని అంటారు. ఈయన గురించి నారద, భాగవత, బ్రహ్మాండ, విష్ణు, స్కాంద, పద్మ మరియు బ్రహ్మ పురాణాలలో అలానే వాల్మీకి మహర్షి తన రామాయణ మహా కావ్యంలో పేర్కొన్నారు. వేదవిద్యాకోవిదుడని, యోగ విద్యలో ప్రావీణ్యం ఉన్నవాడిని, అన్నింటికీ మించి పరమ శివ భక్తునిగా తెలిపారు. కపిల ముని భారత దేశ నలుచెరగులా సంచరించారు. ఆ సమయంలో నిత్య పూజ నిమిత్తం ఆయా ప్రదేశాలలో ఒక శివలింగం ప్రతిష్టించేవారట. కపిల తీర్ధం లోని శివలింగం తరువాత మహర్షి ప్రతిష్టించిన అంతే మహిమాన్విత లింగం మన రాష్ట్రంలోనే ఉన్నది. అదే "అప్పికొండ" దక్ష...